మహబూబ్‌నగర్

రైతుబాగు కోసమే రైతుబంధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీపనగండ్ల, మే 18: రైతుల బాగు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మండల పరిధిలోని వల్లభాపూర్ గ్రామంలో రైతుబంధు కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు. కాగా, ముందుగా రైతులు కేసీఆర్, జూపల్లి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం రైతులకు మంత్రి పట్టాదారు పాస్‌పుస్తకాలను, రైతుబంధు చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ దేశానికి రైతే వెన్నుముకగా భావించి రైతుబంధు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు. ఎన్నో పథకాలతో ఇప్పటికే దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతుబంధు ద్వారా మరోసారి దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. అర్హులైన ప్రతి రైతుకు ఎకరానికి రూ.4వేల పెట్టుబడి సాయంగా అందజేస్తారని, ప్రతి సంవత్సరం రెండు పంటలకు రైతులకు సాయం అందుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న సన్న, చిన్నకారు రై తులకు ఈ సాయం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్ అందిస్తుందన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ రమేష్‌రెడ్డి, వ్యవసాయ అధికారి డాకేశ్వర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నారాయణరెడ్డి, పాన్‌గల్ సింగిల్‌విండో చైర్మన్ బాల్‌రెడ్డి, పాన్‌గల్ ఎంపీపీ వెంకటేష్, జడ్పీటీసీ రవి, సర్పంచు శ్రీలత, టీఆర్‌ఎస్ నాయకులు సుదర్శన్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, చక్రవెంకటేష్, దామోదర్‌రెడ్డి, సాయిరాం, గోపాల్‌నాయక్ తదితరులు ఉన్నారు.
రైతుబంధుతో రైతులకు ఎంతో మేలు
కొల్లాపూర్: రైతుబంధు పథకంతో రైతు తన భూమిలో తనకు ఇష్టమొచ్చిన పంటను వేసుకునేందుకు, అధిక లాభాలను పొందేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం నగర పంచాయతీ పరిధిలోని బయరపల్లి, మండలంలోని చింతలపల్లి గ్రామాలలో రైతుబంధు పథకం చెక్కులను, పాస్ పుస్తకాలను మంత్రి జూపల్లి పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి రైతులకోసం చేపట్టని విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు లక్ష రూపాయల వరకు పంటల రుణమాఫీ చేయడంతోపాటు రైతుబంధు పథకం పేరుతో ఖరీఫ్, యాసంగికి కలిపి ఎకరాలకు రూ.8వేలు చొప్పున అందచేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 8లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ నిరంతరం విద్యుత్ సరఫరా జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు అర్థంలేని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు అన్ని తెలుసని సమయం వచ్చినప్పుడు అలాంటి వారికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ సరస్వతీ, ఎంపీపీ నిరంజన్‌రావు, జడ్పీటీసీ హన్మంతునాయక్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

గ్రామాలాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
పాన్‌గల్: గ్రామాలాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తెల్లరాళ్ళపల్లి తండాలో టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రజా రైతుసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందన్నారు. గ్రామాలలో ప్రతి గల్లీలో సిమెంటు రోడ్ల కోసం అధిక నిధులు కేటాయించామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంకటేష్‌నాయుడు, విండో వైస్ చైర్మన్ భాస్కర్‌యాదవ్, నాయకులు గోవర్దన్‌సాగర్, రాజునాయక్, బాబునాయక్, రవినాయక్, సీతమ్మ పాల్గొన్నారు.