మహబూబ్‌నగర్

బార్ కౌన్సిల్ అభివృద్ధి కోసం రూ.10లక్షలు కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 21: బార్ కౌన్సిల్ అభివృద్ధి సిడిఎఫ్ నిధుల నుండి రూ.10లక్షలను కేటాయిస్తున్నట్లు అందుకు సంబంధించిన ప్రొసిడింగ్‌ను జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు అందజేయడం జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్‌రావు తెలిపారు. సోమవారం మహబూబ్‌నగర్ కోర్టు అవరణలో గల బార్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన న్యాయవాదుల సమావేశంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ న్యాయవాదుల హక్కులకు సంబంధించి జాతీయ, రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో తరచూ తాను ప్రస్తావిస్తుంటానని తెలిపారు. న్యాయవాదుల మరణాతరం ప్రస్తుతం రూ.3లక్షలు అందుతున్నాయని అయితే వీటిని రూ.5లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నామని ఈ ప్రతిపాదనను ఇప్పటికే ప్రభుత్వం ముందు ఉంచామన్నారు. రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ నుండే పలు విధాలుగా సహాయం అందుతుందని తెలిపారు. రాబోయే కాలంలో మహబూబ్‌నగర్ జిల్లా బార్ అసోసియేషన్‌కు మరింత సహయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. జిల్లా బార్ అసోసియేషన్ అభివృద్ధి కోసం రూ.10లక్షల నిధులు ఇచ్చిన ఎమ్మెల్సీ రాంచందర్‌రావును న్యాయవాదులు అనంతరెడ్డి, గోపాల్, నాగేందర్, వీరబ్రహ్మచారి, రవికుమార్‌యాదవ్, అంజయ్య, విక్రమ్‌దవ్‌తో పాటు పలువురు సినియర్ న్యాయవాదులు ఘనంగా సన్మానించారు.

ఠాణాకు వచ్చే బాధితులకు న్యాయం చేయాలి
- మహబూబ్‌నగర్ ఎస్పీ అనురాధ
మహబూబ్‌నగర్‌టౌన్, మే 21: పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు చట్టపరంగా చేయగలిగిన పూర్తి న్యాయం అందించడం తమ బాధ్యతగా భావించాలని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ అనురాధ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదుల దినోత్సవంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 24 మంది ఫిర్యాదుదారులు ఎస్పీని కలిశారు. ఈసందర్భంగా పలువురు ఎస్పీని కలుసుకుని తమ సమస్యను విన్నవించారు. జిల్లా కేంద్రానికి చెందిన ఒక విద్యాసంస్థ యాజమాన్యం ఉచిత శిక్షణ పేరుతో తమను మభ్యపెట్టి గత సంవత్సరం డబ్బులు వసూలు చేశారని, శిక్షణ ఇవ్వకపోగా కనీసం స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వలేదని విద్యార్థులు వాపోయారు. ప్రేమ వివాహం చేసుకున్న మూడు యువ జంటలు ఎస్పీని కలిసి తల్లిదండ్రులు, బంధువుల నుండి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేయగా కౌనె్సలింగ్ నిర్వహణకై స్థానిక అధికారులను ఆమె ఆదేశించారు. భార్యభర్తల నడుమ మనస్పర్థలు ఏర్పడి కేసులు దాకా వెళ్లిన వారిని ఎస్పీ సున్నితంగా మందలించి క్షణికావేశంలో జీవితాలను నాశనం చేసుకోవద్దని, కన్నబిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా భూతగాదాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలిస్తూ తమశాఖ పరిధిలో వచ్చే వివాదాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలుపుతూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.