మహబూబ్‌నగర్

టీడీపీ సహకారంతోనే 2019లో ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 21: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మళ్లీ పూర్వవైభవం రానుందని ఆదిశగా అడుగులు పడుతున్నాయని తెలుగదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ కొత్తకోట ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి తెలిపారు. టీడీపీ సహకారంతోనే 2019లో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని గాయిత్రీ పంక్షన్‌హాల్‌లో మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన మినీ మహానాడును జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎర్ర శేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా టీడీపీ నాయకులు ముందుగా పార్టీ కార్యాలయం, ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈసందర్భంగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు వచ్చినంత మాత్రానా పార్టీ ఉండదనుకోవడం మూర్ఖత్వమన్నారు. పార్టీ రాష్ట్రంలో బలమైన శక్తి అవతరించబోతుందని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో వార్డు మెంబర్ నుండి మొదలుకుని జడ్పీటీసీ స్థానాలకు తప్పకుండా పోటీ చేస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు సాధించామో తెలంగాణనూ మళ్లీ అలాంటి ఫలితాలను సాధించబోతున్నామని తెలిపారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బీజేపీతో తెగతెంపులకు తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకత్వం స్వాగతించిందన్నారు. పాలమూరు జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కన్నా మంచి ఫలితాలను సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే జిల్లాలో నారాయణపేట ప్రాజెక్టును పక్కన పెట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 69 జీఓ ద్వారా నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టును నిర్మించి ఉంటే ఇక్కడి ప్రజలకు సాగునీరు వచ్చి ఉండేదన్నారు. కానీ నారాయణపేట ఎమ్మెల్యేతో పాటు జిల్లా మంత్రులు అసమర్థులు కావడంతో ప్రాజెక్టు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో పాలమూరు జిల్లాకు చేసింది ఏమిలేదని అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పది లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తానని చెప్పిన మాటలు నీటిమూటలుగానే మారాయని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలను రాబోయే ఎన్నికల్లో కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అన్ని గ్రామాల పార్టీ కమిటీలను దాదాపుగా పూర్తి చేశామన్నారు. ఈనెల 24న హైదరాబాద్‌లో జరిగే మహానాడుకు గ్రామాల్లో పెద్దఎత్తున్న టీడీపీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములు మాట్లాడుతూ జిల్లాలో పార్టీకి గతంలో లక్ష సభ్యత్వాలు ఉండేవని ప్రస్తుతం జిల్లాలు విభజన జరిగాక కూడా సభ్యత్వాల విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది జరగలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే సీతమ్మ మాట్లాడుతూ మినీ మహానాడులతో పార్టీ క్యాడర్‌లో మంచి ఉత్సహం నింపిందన్నారు. ప్రతి కార్యకర్తల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీడీపీ నాయకులు జయశ్రీ, నాగేశ్వర్‌రెడ్డి, వెంకన్న, శ్రీనివాసులు, మాల్యాద్రి, శ్రీనివాస్‌యాదవ్, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.