మహబూబ్‌నగర్

రైతుబంధు కాదు దొరలబంధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయిజ, మే 21: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం రాబంధు పథకమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వీ.హన్మంతరావు విమర్శించారు. చెక్కులు తీసుకొవడానికి వచ్చినావాళ్లు పెద్దపెద్ద కార్లలో వచ్చారంటే అది ఏమాత్రం పథకమో ఇట్టే అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. సోమవారం షెక్సావలి చారి మిత్రబృందం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా అయిజ పట్టణం వెంకటేశ్వర ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సామాన్య రైతులకు కాకుండా దొరలకు మేలు చేసి దొరబుద్ధి చూపించుకుని విశ్వాసం నిలుపుకున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్, కాంగ్రెసోళ్లు లోఫర్లు అని పదే పదే విమర్శిస్తున్నారని, అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కేసీఆర్ కూడా ఒక లోఫరేనని తిప్పికొట్టారు. బ్యాంకులు, ఏటీఎంలో డబ్బులు లేవు, నల్లధనం తెచ్చి సామాన్యుల బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తానని ఖాతా తెరిపించి, జీఎస్టీ పేరుతో సామాన్యుల నడ్డి విరిచి ప్రధాని మోదీ, అమిత్‌షాలు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. అందరు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 3600 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క రైతు ఇంటికి వెళ్లి పరామర్శించలేదన్నారు. పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ కేసీఆర్ మంత్రులను దద్దమ్మల్లా, రబ్బరు స్టాంపులను చేశారని విమర్శించారు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ రైతుబంధు పథకం పేరుతో ఇప్పటి నుండి ఎన్నికల్లో డబ్బులు పంచటం మొదలు పెట్టారని ఆరోపించారు. ఇది కౌలు, సామాన్య రైతులకు కాకుండా భూస్వాములకు మేలు చేసేదిగా ఉందని ఆరోపించారు. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ ఎన్ని కష్టాలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ వీడనని స్పష్టం చేశారు. ఆర్డీఎస్ రైతులకు మేలు చేస్తానని, అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి మరువని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ యువరరక్తంతో కాంగ్రెస్ తిరిగి అధికారం దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు భూంపురం నర్సింహరెడ్డి, సురేంద్రస్వామి, రవిరెడ్డి, లక్ష్మన్న, రాజు, దొడ్డప్ప, హన్మన్నగౌడ్, తిప్పన్న, లాల్‌గౌడ్, దేవేంద్ర పాల్గొన్నారు.
భారీ ర్యాలీ..
కాగా, అంతకు ముందు షేక్సావలి చేరికను పురష్కరించుకుని గద్వాల రహదారి సబ్ స్టేషన్ నుండి వెంకటేశ్వర ఫంక్షన్ హాలు వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైకులు ర్యాలీ నిర్వహించారు.

కృష్ణాజలాలు ఇవ్వకుంటే గ్రామాల్లో తిరగం
*రెండునెలల్లో తాగునీరందిస్తాం - ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్‌టౌన్, మే 21: మిషన్‌భగీరథతో గ్రామాల్లోని ప్రజలకు కృష్ణాజలాలు ఇవ్వకుంటే గ్రామాల్లో తిరగనని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో రైతుబంధు పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు నుండి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రెండునెలల్లో మంచినీటిని అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం ద్వారా రైతులకు అందించే పెట్టుబడి సహయాన్ని వ్యవసాయానికే వాడాలని రైతులకు సూచించారు. గత ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఎకరాకు రూ.4వేల పెట్టుబడి సహయాన్ని అందిస్తున్నారన్నారు. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు కోర్టులకు వెళ్లి కేసులు వేసి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రజలు కూడా గమనిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలు కూడా అభివృద్ధి చేస్తున్న వారిని గుర్తించి ఎన్నుకోవాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ సావిత్రి, జడ్పీటీసీ శ్రీదేవి, వైస్ ఎంపీపీ సరస్వతమ్మ, గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, తహశీల్దార్ శంకర్ పాల్గొన్నారు.