మహబూబ్‌నగర్

పుకార్లను నమ్మి ఆందోళన చెందొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, మే 22: సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లు నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని మహబూబ్‌నగర్ ఎస్పీ అనురాధ సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ అనురాధ మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైన అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి కానీ దాడులు చేయెద్దన్నారు. గండీడ్ గ్రామంలో చిన్నారులను ఎత్తుకెళ్తున్నారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మి అనుమానిత వ్యక్తులపై దాడి చేసి వారి వాహనాన్ని తగలబెట్టిన సంఘటనలో ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకై పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. బయటకు కనిపించే విధులు కాకుండా ఆయా గ్రామ పట్టణాల్లో అనుమానిత ప్రదేశాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారని ఆమె పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న బీహార్ వ్యక్తులు గ్రామాల్లోకి వచ్చి చిన్నారులను ఎత్తుకెళ్తున్నారని ప్రచారం జరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ఈ విషయాన్ని పోలీసులు కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ముఖ్యంగా ఎవరైన అనుమానిత వ్యక్తులు కనిపించినట్లు అయితే 100 నంబర్‌కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని లేదా సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. వదంతులు సృష్టించేవారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని తప్పుడు వార్తలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారంచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి
మహబూబ్‌నగర్‌టౌన్, మే 22: కేంద్ర ప్రభుత్వం ఆమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని కోడూర్ గ్రామంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా లబ్దిదారులకు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రం ఆమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా మార్చుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రం నుండి వస్తున్న నిధులను గ్రామాల్లో ఖర్చు పెట్టడం లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని వచ్చే ఎన్నికల్లో తెరాస ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో అధికారమే ధ్యేయంగా కార్యకర్తలు పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణవర్థన్‌రెడ్డి, అంజయ్య, పోతుల రాజేందర్‌రెడ్డి, కరుణాకర్‌గౌడ్, రాజుగౌడ్, జాం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.