మహబూబ్‌నగర్

ఎత్తిపోతలను వినియోగంలోకి తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినేపల్లి, మే 22: కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు అనుగుణంగా మరమ్మతులు చేపట్టాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఐబీ, ఐడీసీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని దాదాపు పదివేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే చిన్నమారూరు ఎత్తిపోతల పథకంతో పాటు చెల్లపాడు, గోపులాపూర్, మాధవస్వామి నగర్ పథకాలపై చర్చించారు. వీటికి సంబంధించి చేపట్టాల్సిన మరమ్మత్తులపై సమీక్ష నిర్వహించారు. చిన్నంబావి మండలంలోని చిన్నమారూరు ఎత్తిపోతల పథకం కింద ఉన్న ఆయకట్టులో దాదాపు ఆరువేల ఎకరాలకు జూరాల నీరు అందుతుందని అధికారులు వివరించారు. దీన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు రూ.8.76కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే వీపనగండ్ల మండలంలోని చెల్లపాడు ఎత్తిపోతల పథకానికి రూ.2.35కోట్లతో, కొల్లాపూర్ మండలంలోని గోపులాపూర్ ఎత్తిపోతల పథకానికి రూ.1.79కోట్లతో మాధవస్వామినగర్ ఎత్తిపోతలకు రూ. 1.12కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఎలక్ట్రికల్ పంప్‌లతో లీకేజీలను పూర్తి స్థాయిలో నివారించగలిగితే వీటి ద్వారా నియోజక వర్గంలోని దాదాపు 13వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించవచ్చని ఐడీసీ అధికారులు వివరించారు. అలాగే పెంట్లవెల్లి మండలంలోని వెంగంపల్లి, వెంకల్ ఎత్తిపోతలకు కూడా మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని ఐబీ అధికారులు మంత్రికి వివరించారు. ఈ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఉందని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను తక్షణమే అందజేయాలని అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు. సమీక్షలో ఐడీసీ ఎస్‌ఈ లక్ష్మారెడ్డి, ఈఈ నరుూంఖాన్, ఐబీ ఈఈ గోవిందు పాల్గొన్నారు.

వైద్యం అందక వ్యక్తి మృతి
- ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ల తీరుకు నిరసనగా ధర్నా - ఓ డాక్టర్ సస్పెండ్, మరో డాక్టర్‌పై చర్యలు

తెల్కపల్లి, మే 22: ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందక వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బంగారయ్య(40)అనే వ్యక్తి అనారోగ్యంతో మంగళవారం మధ్యాహ్నం తెల్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కుటుంబ సభ్యులు తీసుకొని వెళ్లారు. విధుల్లో ఉండాల్సిన డాక్టర్ లేకపోవడం, ఉన్న డాక్టర్ పట్టించుకోకపోవడంతో బంగారయ్య సరైన వైద్యం అందక మృతి చెందాడని మృతుడి బంధువులు ఆరోపించారు. డాక్టర్ల తీరును నిరసిస్తూ ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి మూడు గంటల పాటు ఆస్పత్రి ముందు ధర్నా చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ లాల్, నాగర్‌కర్నూల్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పినా ధర్నా విరమించలేదు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, విధులపట్ల నిర్లక్ష్యం వహించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో జిల్లా వైద్యాధికారి డాక్టర్ అరవింద్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ, మరో డాక్టర్ ఉమాశంకర్‌కు మెమో ఇచ్చి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే బాధిత కుటుంబానికి కలెక్టర్‌తో మాట్లాడి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా, మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.