మహబూబ్‌నగర్

చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, మే 25: చట్టాన్ని చేతిలో తీసుకొని అమాయకులపై దాడులు చేయడం సరికాదని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలభవన్‌లో సామాజిక మాధ్యమాలలో వస్తున్న వదంతులపై సర్పంచులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎస్పీ రైమా రాజేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు, పుకార్లు నమ్మొద్దని, ప్రజలను భయాబ్రాంతులకు గురిచేయోద్దని సూచించారు. పార్థీగ్యాంగ్ పిల్లలను ఎత్తుకపోవడం, చంపడం వంటి వదంతులు సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులకు షేర్ చేయడం వల్ల అది నమ్మి ప్రజలు గ్రామాల్లో నిద్ర పోకుండా రాత్రి సమయాల్లో జాగరణ చేస్తున్నారన్నారు. తద్వారా రాత్రి వేళ్లలో అమాయకులపై యువకులు కర్రలతో దాడులు చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. అలా దాడికి పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. గ్రామాల్లో పాకిన వదంతులు వట్టి పుకార్లేనని, ప్రజలను చైతన్యవంతులుగా చేసే బాధ్యత సర్పంచుదేనన్నారు. సర్పంచు బాధ్యతగా గ్రామాల్లో సోషల్‌మీడియాలో వస్తున్న పుకార్లపై ప్రజలను చైతన్యం చేయడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సర్పంచులు, పోలీసులు సమన్వయంతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. వాట్సాప్‌లో వస్తున్న వదంతులను ఇతరులకు షేర్, ఫార్వర్డ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని, ఇప్పటికే జిల్లా పోలీసు యంత్రాంగం ప్రతి గ్రామంలోని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేశారని ఆమె పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే వారిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పాలన్నారు. కార్యక్రమంలో డిఎస్పీ సురేందర్‌రావు, గద్వాల, అలంపూర్ సీఐలు వెంకటేశ్వర్లు, రజితా రెడ్డి, ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో చెప్పేది ఎక్కువ చేసేది తక్కువ
- కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి
వెల్దండ, మే 25: రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువగా మారిందని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం మం డలంలోని కొట్రలో నూతన వాటర్‌ట్యాంకు నిర్మాణానికి భూమి పూజతో పాటు కొట్రతండాలో నిర్మించిన వాటర్ ట్యాంకును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మాయ మాటలతో మోసం చేస్తు మభ్య పెడుతుందన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం అక్కరకురాని తాయిలాలు ప్రకటిస్తోందని విమర్శించారు. అలాగే ఏకకాలంలో రుణమాఫీ చేయకుండ విడతల వారిగా చేయడం మూలంగా రైతులకు ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు కేవలం జేబులు నింపుకునే పథకాలనని ఆయన అరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా అన్నివర్గాల ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకోని పాలన సాగిస్తుందన్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, గ్రామాల రూపురేఖలు పూర్తిగా మార్చివేయడం జరిగిందని గుర్తు చేశారు. తిరిగి కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడటం ఖాయమన్నారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షడు మోతిలాల్‌నాయక్, డీసీసీ అధికార ప్రతినిధి కాయితి విజయ్‌కుమార్‌రెడ్డి, ఎంపీటీసీ కడారి కృష్ణయ్య, నాయకులు శ్రీనివాస్‌యాదవ్, రాజుచారి, చందర్, రుక్కయ్య, వెంకటయ్య, నిరంజన్, చంటి, శ్రీను, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.