మహబూబ్‌నగర్

యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, మే 25: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. అవసరమైతే షిఫ్టుల వారిగా పనులు చేపట్టాలని సూచించారు. శుక్రవారం సచివాలయం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కేఎల్‌ఐ ప్రాజెక్టులతోపాటు భీమా ప్రాజెక్టుల పనుల పురోగతిపై నీటిపారుదల శాఖాధికారులతో ఆయన సమీక్షించారు. ఈసమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితోపాటు ఈఎన్‌సీ మురళీధర్‌రావు, ఆయా ప్రాజెక్టుల అధికారులు పాల్గొన్నారు. కేఎల్‌ఐ పథకంలో 130 కిలోమీటర్ల పనులు చేపడుతున్న కాంట్రాక్టు ఏజెన్సీల నిర్వాహకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేఎల్‌ఐ ప్రధాన కాల్వ పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని ఆయన అధికారులను, ఏజెన్సీలను ఆదేశించారు. ఈ పనుల పురోగతిపై ఇప్పటి నుంచి ప్రతి 10రోజులకు ఒకసారి సమీక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ పనులకు సమాంతరంగా డిస్ట్రిబ్యూటరీ కాలువ పనులను కూడా చేపట్టాలన్నారు. నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలో లక్ష ఎకరాల ఆయకట్టుకు ఆగస్టు 15 నాటికి నీరందించే లక్ష్యంతో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులుంటే స్థానిక ప్రజా ప్రతినిధులల సహాయంతో వాటిని పరిష్కరించుకొని ముందుకు సాగాలన్నారు. 0-90 కిలోమీటర్ల ప్రధాన కాలువలో మొత్తం 207 నిర్మాణాలకు గాను 150 మాత్రమే పూర్తి చేయడం జరిగిందని అధికారులు వివరించారు. మిగిలిన వాటిలో 28 పనులు పురోగతిలో ఉన్నాయని, వీటిని జూన్ నెలాఖారులోగా పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. పాలమూరు ఎత్తిపోతలతోపాటు భీమా పథకాలను పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి అన్నారు. ఇందుకోసం ఇంజనీరింగ్ అధికారులతోపాటు కాంట్రాక్టు ఏజెన్సీల నిర్వాహకులు కూడా పూర్తి స్థాయిలో కృషి చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో సీఈలు ఖగేందర్, లింగరాజు, ఎస్‌ఈ భధ్రయ్య తదితరులు పాల్గొన్నారు.