మహబూబ్‌నగర్

ఎస్సీ, ఎస్టీ చట్టాలను కాపాడుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్‌గల్, మే 26: ఎస్సీ, ఎస్టీ చట్టాలను కాపాడుకుందామని ఎమ్మార్పి ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోళ్ళ వెంకటేష్, ఎం ఈ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గద్వాల కృష్ణ, మాల మహనాడు రాష్ట్ర ప్రదాన కారదర్శి మలిపెద్ది చంద్రశేఖర్‌లు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ కుల సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ జూన్ 10న వరంగల్‌లో జరిగే దళిత, గిరిజ సింహగర్జన మహసభలు నిర్వహిస్తునందున ఈ సమావేశానికి దళిత, గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాలు ఎస్సీ, ఎస్టీ చట్టానికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి పరిరక్షణ సమితి నాయకులు చంద్రునాయక్, వీరప్ప, గంధం లక్ష్మయ్య, దశరథం, నర్సింహ్మ, ఉస్సేన్, సుదాకర్‌నాయక్, సహదేవ్‌నాయక్, సన్నయ్య , అదిశ్రీను తదితరులు పాల్గొన్నారు.