మహబూబ్‌నగర్

మిగిలిపోయన రైతుబంధు చెక్కులను త్వరితగతిన పంపిణీ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, మే 26: మిగిలిపోయిన రైతుబంధు చెక్కులను , పట్టాదారు పాసుపుస్తకాలను సాద్యమైనంత త్వరగా పంపిణి చేయాలని రైతుబందు జిల్లా ప్రత్యేకాధికారి అనితా రాజేంద్ర అన్నారు. శనివారం ఆమె వనపర్తిలోని తరుణి పంక్షన్‌హాల్‌లో తహశీల్దార్, మండల వ్యవసాయ అధికారులు , వ్యవసాయ విస్తరణ అధికారులు , వీ ఆర్వోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని రైతుబంధు పథకం చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు, 80 శాతం పక్కగా ఉన్నాయని, మిగిలిన 20 శాతం పూర్తి చేయాలని ఆమె కోరారు. ముఖ్యంగా ప్రింటయిని పట్టాదారు పాసుపుస్తకాలు, చెక్కులను నూటికి నూరుశాతం పంపిణి చేయాలని ఆమె కోరారు. తప్పులను సరి చేయాల్సి ఉన్న పాసుపుస్తకాలకు సంబందించిన కస్రా, పహాణి,120 రిజిస్ట్రేషన్లను మరోసారి తప్పులను సరి చేసుకోవాలన్నారు. 10 రోజులో లోపు తప్పలను సరి చేసుకొవాలని ,రాష్ఠ్ర ప్రభుత్వం త్వరలోనే ధరణి వెబ్‌సైట్ ప్రారంభిస్తుందని, అంత లోపు భూములకు సంబందించిన అన్ని తప్పులను సరిదిద్దుకొవాలన్నారు. మళ్ళి తప్పులు దోరిళితే కఠిన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శే్వతామహంతి మాట్లాడుతూ పవర్ పాయింట్ ప్రోజెక్టర్ ద్వారా రైతుల చెక్కులను, పట్టాదారు పాసుపుస్తకాలను ప్రత్యేకాదికారికి వివరించారు. జిల్లాలో మొత్తం ఒక లక్ష 72వేల 805ఖాతాలు, 5లక్షల 13వేల 539 ఎకరాల విస్తీర్ణం ఉందని, ఇందులో ఒక లక్ష 63వేల 675 ఖాతాలు స్పష్టంగా ఉన్నాయని, అలాగే 4లక్షల 83వేల 280 ఎకరాల భూమి స్పష్టంగా ఉందని, బి క్యాటగిరి 9130 ఖాతాలు , 30178 ఎకరాల భూమి ఉందని , చెక్కులు,పట్టాదారు పాసుపుస్తకాల పంపిణికి ఒక లక్ష 52వేల 981 ఖాతాలు, 3లక్షల 55వేల 320 ఎకరాల భూమిని సిపార్సు చేయడం జరిగిందన్నారు. ఒక లక్ష 32వేల 438 ఖాతాలు ఆధార్ ఫిడింగ్ అయిందని తెలిపారు. ఇప్పటి వరకు 99518 పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణి చేశామని , ఆధార్ ఖాతాలు ఇవ్వని 20543 ఖాతాలు ఉన్నాయని, ఫోటోలు తప్పుగా ఉండటం, పాసుపుస్తకాలో చిన్న చిన్న తప్పులు ఉన్నాయని తెలిపారు. కొత్తగా ఆధార్ 4వేలు ఉన్నాయని తెలిపారు. షెడ్యూల్ ప్రారంభమయిన వెంటనే తప్పులను సరి చేసుకునేందుకు తహశీల్దార్లు సిద్దంగా ఉండాలని , తప్పులు సరిదిద్దుకొని పట్టాదారు పాసుపుస్తకాలకు సంబందించిన ఆన్‌లైన్‌తో పాటు హర్డ్ కాపి కూడా సిద్దంగా ఉంచుకోవాలని ,మోబైల్ యాప్ నిర్వహించుకునేల తహశీల్దార్లు పూర్తిగా అప్రమాతమై ఉండాలని సూచించారు.