మహబూబ్‌నగర్

భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాపూర్, ఏప్రిల్ 29: నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణంతో భూములు, ఇల్లు కోల్పొయిన వారందరికి ప్రభుత్వం అండగా ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణ ప్రదేశంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ కృష్ణానీటిని జిల్లాలోని ప్రతి సెంటు, ప్రతి గుంటకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు. పాలమూరు జిల్లా పరిస్థితులు తెలిసిన సిఎం కేసిఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ప్రాజెక్టుగా 35వేల కోట్లతో పిఆర్‌ఎల్‌ఐ ప్రాజెక్టును చేపట్టడం జరిగిందని, వచ్చే రెండున్నర ఏళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాలనే కృతనిశ్చయంతో సిఎం ఉన్నారని అన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నిర్మాణంతో కొల్లాపూర్ నియోజకవర్గంలో 36 గ్రామాలు మునిగిపోయాయని, వారి త్యాగఫలితంగానే నేడు ఈ రిజర్వాయర్ ద్వారా వివిధ ప్రాజెక్టులను నిర్మించి జిల్లాకు సాగునీరు అందించగలుగుతున్నామన్నారు. కెఎల్‌ఐ ప్రాజెక్టులో ముంపుకు గురైన భూములకు ఎకరాకు రూ.75వేలు ఇవ్వగా, నేడు పిఆర్‌ఎల్‌ఐ ప్రాజెక్టులో ముంపుకు గురయ్యే భూములకు మార్కెట్‌ధరకు అనుగుణంగా పరిహారం ఇస్తున్నామని, అదనంగా ఐదులక్షలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణంతో అంజనగిరి, వాల్యానాయక్‌తండా, సున్నపుతండా, వడ్డెగుడిసెలకు చెందిన 218 ఇళ్లు ముంపుకు గురవుతున్నాయని, వీరందరికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని, ఇంటి స్థలాలకు సంబందించి నివేదిక వచ్చిన 15రోజులలో పరిహారం అందిస్తామని తెలిపారు. పిఆర్‌ఎల్‌ఐతోపాటు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారందరిని స్వగ్రామాలకు తిరిగి వచ్చేలా చేస్తామన్నారు. సమావేశంలో మంత్రి లక్ష్మారెడి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆలె వేంకటేశ్వర్‌రెడ్డి, ఇఎన్‌సి మురళీధర్, సిఇ లింగరాజు, కలెక్టర్ శ్రీదేవి, జెసి రాంకిషన్, నాగర్‌కర్నూల్ ఆర్డీవో దేవేందర్‌రెడ్డితోపాటు వివిధ శాఖల అధికారులు, పలువరు ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.