మహబూబ్‌నగర్

రక్తం గోల్‌మాల్‌పై విచారణ జరుపుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరచింత, జూన్ 18: గత నెలలో 4 నుంచి 6 వరకూ అమరచింత మండల కేంద్రంలో జరిగిన సయ్యద్ హజరత్‌షా రాజవాలి దర్గా ఉర్సు ఉత్సవలలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పలువురు రక్తదాతల నుంచి సేకరించిన రక్తం రెడ్‌క్రాస్ వారికి అందకుండా గోల్‌మాల్ జరిగిందని వస్తున్న ప్రచారంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ వెల్లడించారు. ఉర్సులో సేకరించిన రక్తం గోల్‌మాల్, అమరచింతలో జోరుగా ప్రచారం అని ఆదివారం ఆంధ్రభూమి దిన పత్రికలో వచ్చిన వార్తకు ఆయన స్పందించారు. ఈసందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల డ్రగ్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ ఆంధ్రభూమి ప్రతినిధితో ఫోన్లో మాట్లాడుతూ వనపర్తి జిల్లా రెడ్‌క్రాస్‌లో జిల్లా యూత్ కన్వీనర్‌గా పని చేస్తున్న కలాంపాష ఈ రక్తదాన శిబిరం ఎవరి అనుమతితో నిర్వహించారు? అందులో పాల్గొనేందుకు వచ్చిన డాక్టర్ల బృందం ఎవరూ? ఎంత మంది రక్తదానం చేశారు? ఎంత రక్తం సేకరించారు? ఎవరికి అప్పగించారు? అనే దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదక అందజేస్తామని ఆయన తెలిపారు.