మహబూబ్‌నగర్

ప్రతిపక్షాల ఆటంకం వల్లే పాలమూరు ఎత్తిపోతల పనుల్లో జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 18: ప్రతిపక్ష పార్టీల ఆటంకం కల్పిస్తున్నందువల్లే పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల్లో జాప్యం జరుగుతోందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయ సమీపంలో రూరల్ మండలంలోని గ్రామాలకు చెందిన 39మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ వచ్చే ఎండాకాలం నాటికి పాలమూరు ఎత్తిపోతల పథకంతో చెరువుల అలుగులను పారిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించిన పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు ఆపబోమన్నారు. జిల్లాలోని రైతుల సంక్షేమం కోసం చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి అయితే తమకు పుట్టగతులు ఉండవనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టులకు వెళ్లి కేసులు వేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగిందని దీనిని ప్రతిపక్ష నాయకులు అడ్డుకోవాలని చూడడం తగదని హెచ్చరించారు. నెలరోజుల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాల్లో తాగునీరు అందిస్తున్నామని ఇప్పటికే ఈ పథకం అమలులో భాగంగా మన్యంకొండ గుట్టపై నిర్మించిన రిజర్వాయర్‌లోకి కృష్ణా జలాలు వచ్చాయని ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలాంటి ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలిగించలేదని ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై లేనిపోని అనుమానాలను ప్రతిపక్షాలు ప్రజల్లో రేకిత్తింపజేస్తున్నారని అన్నారు. ప్రజలు కూడా అభివృద్ధిని కూడా ఆదరించి ప్రతిపక్ష పార్టీల కుట్రలు తిప్పికొట్టాలని సూచించారు. కల్యాణలక్ష్మీ పథకం పెద్దింటి పిల్లలకు గొప్పవరం లాంటిదని ఈ పథకంలో ఎలాంటి పైరవీలకు తావులేదని ఎవరైన డబ్బులు అడిగితే తనకు ఫోన్ చేస్తే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తానని ఆయన హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు తిరిగి పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ సావిత్రి, జడ్పీటీసీ శ్రీదేవి, వైస్ ఎంపీపీ మల్లు సరస్వతమ్మ, గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, తహశీల్దార్ శంకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి
మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 18: కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి కార్యకర్తలకు సూచించారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పద్మజారెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లి కేంద్ర పథకాలను ప్రజలకు తెలిసేలా చూడాలన్నారు. అదేవిధంగా పాండురంగారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ బలహీనవర్గాల భూములను భూప్రక్షాళన పేరుతో వారి భూములను కోల్పోయిన వారి పక్షాన న్యాయపోరాటం చేస్తామన్నారు. మిషన్ భగీరథ పేరుతో అడ్డగోలుగా సీసీరోడ్లు, బీటీరోడ్లు, డ్రైనేజీలు, ధ్వంసం చేసి ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. తక్షణమే ధ్వంసం చేసిన పనులను మిషన్ భగీరథ నిధులతో తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వీరబ్రాహ్మచారి, పడాకుల సత్యం, అంజయ్య, విష్ణువర్థన్‌రెడ్డి, నయూమ్ తదితరులు పాల్గొన్నారు.