మహబూబ్‌నగర్

జడ్చర్లకు గురుకుల మహిళా డిగ్రీ కళాశాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, జూన్ 18: మూడేళ్ల క్రితం నాగర్‌కర్నూల్‌కు మంజూరైన సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను స్థానికంగా సరైన వసతులు ఉన్న గదులు దొరకడంలేదనే కారణం చూపుతూ జడ్చర్లకు తరలిస్తూ సంబంధిత శాఖాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. దీనితో కళాశాల ప్రిన్సిపాల్‌తోపాటు ప్రాంతీయ అదనపు కో-ఆర్డినేటర్ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం స్థానికంగా అద్దెకు ఉన్న కళాశాల భవనం నుంచి ఫర్నిచర్‌ను జడ్చర్లకు సమీపంలోని మాచారం గ్రామానికి తరలింపచేశారు. ఆదివారం సాయంత్రం నుంచే పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో అద్దె భవనంలో ఉన్న గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలోని ఫర్నిచర్ ఇతర సామగ్రిని తరలిస్తున్నట్లు కాలనీ వాసులు తెలిపారు. పాత వాటిని తీసుకొని పోయి కొత్తవి తెస్తున్నారని భావించామని, కానీ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్నారనే విషయం తెలియదని పలువురు కాలనీవాసులు వాపోతున్నారు. సోమవారం ఉదయం అద్దె భవనంలో ఉన్న సామానులను తీసుకొని పోయేందుకు సంబంధిత అధికారులు రావడం, విషయం తెలుసుకున్న విలేఖరులతోపాటు వివిధ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు అక్కడికి చేరుకొని విషయాన్ని ఆరా తీశారు. విద్యార్థులకు సరిపడా గదులు ఉన్న భవనం దొరకడంలేదని, గతేడాది నుంచి పట్టణంలో అనే్వషిస్తున్నామన్నారు. సరైన గదులు లేకపోవడంతో పూర్తిస్థాయిలో విద్యార్థులను చేర్చుకోలేకపోతున్నామని, ఈ విషయాన్ని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కార్యదర్శి దృష్టికి తీసుకొనిపోగా, తాత్కాలికంగా జడ్చర్లకు తరలించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని అడిషనల్ రీజినల్ కో-ఆర్డినేటర్ శ్రీనావాస్‌రెడ్డి తెలిపారు. నాగర్‌కర్నూల్ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 840 మంది విద్యార్థులను చేర్చుకోవాల్సి ఉండగా, ప్రస్తుతం 500 మంది మాత్రమే ఉన్నారని ఇందుకు కారణం సరిపడా వసతులు లేకపోవడమేనని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ మండలంలో తూడుకుర్తిలో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. అక్కడ పక్కా భవనాలను నిర్మించిన తర్వాత జడ్చర్ల నుంచి మళ్లీ ఇక్కడికి మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈసందర్భంగా వివిధ పార్టీల నాయకులకు, శ్రీనివాస్‌రెడ్డికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒకసారి వేరే ప్రాంతానికి కళాశాల వెళ్లిపోతే మళ్లీ అక్కడి నుంచి రావడమనేది అసాధ్యమని, ఇక్కడే ఉంచాలని, కొన్ని రోజులు అవకాశం ఇస్తే అన్ని వసతులతో కూడిన భవనాన్ని చూపిస్తామని స్పష్టం చేశారు. కానీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము నడుచుకుంటామని, ఇప్పటికే తరగతులు జరగక ఆలస్యమైందని, విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని తరగతులను ప్రారంభించాల్సి ఉంటుందని చెప్పారు.
ఇది ఇలా ఉండగా అద్దె భవనం యజమాని ప్రవీణ్ మాట్లాడుతూ ఇంకా అదనంగా గదులు కావాలని అడిగితే తాత్కలిక షెడ్స్‌గాని, శాశ్వత నిర్మాణాలు కాని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. గత 8 నెలల నుంచి అద్దె రావడంలేదని, కనీసం అగ్రిమెంట్ కూడా చేసుకోలేదని ఆయన వాపోయారు. ఇదిలా ఉండగా స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ వసతులు లేక డిగ్రీ కశాళాలను ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ విషయంపై అధికారులతో మాట్లాడి ఇక్కడే ఉండేవిధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అన్ని వసతులతో కూడిన భవనాన్ని గుర్తించామని, యజమానితో మాట్లాడి ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు.

సంపూర్ణ ఆరోగ్యానికి యోగా అవసరం
- గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ
గద్వాలటౌన్, జూన్ 18: సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ యోగా చేయడం అలవర్చుకోవాలని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా సోమవారం స్థానిక పాతబస్టాండులో పతంజలి యోగా సమితి భారత్ స్వాభీమాన్ ట్రస్ట్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన యోగావాక్ ర్యాలీని ఎమ్మెల్యే డీకే అరుణతో పాటు మున్సిపల్ చైర్‌పర్సన్ కృష్ణవేణి జెండా ఊపీ ర్యాలీ ప్రారంభించారు. పాతబస్టాండు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ఈసందర్భంగా ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప విద్య యోగా అన్నారు. పతంజలి మహర్షి రూపొందించిన అష్టంగా మార్గమైన యోగా సాధన ద్వారా సమగ్ర శారీరక, మానసిక వికాసంతో పాటు మనిషిని మహోన్నత స్థితికి తీసుకెళ్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆహార అలవాట్లు మార్చుకొని, తమ విలువైన సమయాని యోగా కోసం కేటాయించి, ఆధ్యాత్మికం చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో పీసీసీ కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, డీసీసీ మహిళా అధ్యక్షురాలు బండల పద్మావతి, కౌన్సిలర్లు, పతంజలి యోగ సమితి అధ్యక్షుడు దేవదాసు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రవీణ్, సభ్యులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.