మహబూబ్‌నగర్

గట్టు ఎత్తిపోతలతో 50వేల ఎకరాలకు నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గట్టు, జూన్ 18: గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా గట్టు ప్రాంతంతో సాగు నీరు అందించడానికి రూ.560 కోట్లతో నిధులతో నిర్మించబోతున్న గట్టు ఎత్తిపోతల పథక పైలాన్ ఆవిష్కరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న సందర్భంగా సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండల పరిధిలోని పెంచికలపాడు గ్రామాన్ని సందర్శించి, పైలాన్ స్థలాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రూ.560కోట్ల నిధులచే చేపట్టే గట్టు ఎత్తిపోతల పథకం వల్ల దాదాపు 50వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. దేశంలోనే అత్యంత వెనుబడిన గట్టు మండలాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో నిధులు మంజూరు చేయించి గట్టు ఎత్తిపోతల పనులు త్వరిగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఆగస్టు 15న తుమ్మిళ్ల ఎత్తిపోతలను ప్రారంభించడానికి సీఎం వస్తారని, తుమ్మిళ్ల ఎత్తిపోతల వల్ల ఆర్డీఎస్ పరిధిలో గల రైతులకు మేలు చేకూరుతుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాగు, తాగు నీటి రంగాలలో ముందంజలో ఉండి రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నదని తెలిపారు. ఈ కార్యక్రమలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బీఎస్ కేశవ్, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డిఎస్పీ సురేందర్‌రావు, పీజేపీ అధికారులు పాల్గొన్నారు.
బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన జూపల్లి
గద్వాల: గట్టు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించడానికి వస్తున్న సీఎం కేసీఆర్ నిర్వహించే బహిరంగ సభకు సంబంధించిన సభాస్థలిని మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. సోమవారం గద్వాల సమీపంలోని నోబుల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించి, సభాస్థలి ఏర్పాట్లను తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎస్పీ రెమా రాజేశ్వరి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బీఎస్ కేశవ్, డీఎస్పీ సురేందర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.