మహబూబ్‌నగర్

కల్వకుర్తి ‘కారు’లో ఓవర్ లోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 18: మరో పదినెలల వ్యవధిలో సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరుగుకుంటూపోతోంది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తనకే టికెట్ ఇస్తారంటూ ఇప్పటికే పలువురు నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. తమ అనుచరగనాన్ని సైతం రంగంలోకి దింపి గ్రామాల్లో సందడి చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగా కల్వకుర్తి టీఆర్‌ఎస్‌లో అదే సందండి నెలకొందని చెప్పవచ్చు. కల్వకుర్తి ‘కారు’ ఓవర్‌లోడ్ అయిందని ఆ పార్టీ నాయకులే చర్చించుకోవడం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. 2019 ఎన్నికల్లో కల్వకుర్తి టీఆర్‌ఎస్ టికెట్‌ను ఆశిస్తున్న వారు దాదాపు అర డజన్‌కు చేరుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఎవరు ప్రజాధరణ పొందితే వారికే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయ. ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ సైతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఓడించే వారికే టికెట్ ఇవ్వాలనే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కసిరెడ్డి నారాయణరెడ్డి, 2014లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, గతవారం రోజుల క్రితం టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే యడ్మ కిష్టారెడ్డిలు 2019 ఎన్నికల్లో టికెట్‌ను ఆశిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో, పార్టీ ఆవిర్భావం సందర్భంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉండి కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన ప్రస్తుత కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ ద్యాప విజితారెడ్డి, మరో ఉద్యమ నాయకుడు, కేసీఆర్‌కు ఉద్యమ సమయంలో చేదోడు వాదోడుగా ఉంటూ కొనేళ్ల పాటు నియోజక ఇన్‌చార్జిగా పనిచేసి గ్రామాల్లో పార్టీ బలోపేతంతో పాటు ఉద్యమాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించిన బాలాజీసింగ్, వీరితోపాటు నియోజకవర్గంలో తనకుంటూ ఓ గుర్తింపు ఉన్న గోలి శ్రీనివాస్‌రెడ్డిలు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్‌ను ఆశిస్తున్నారు. ఇలా అర డజన్ నాయకులు కల్వకుర్తి టికెట్ కోసం తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. అయితే ఒకేసారి ఆరు నాయకులు ఎమ్మెల్యే టికెట్‌ను ఆశిస్తుడం అంతేకాకుండా వీరంతా గ్రామాల్లో ప్రత్యేక అనుచరులను సైతం పెంచిపోషిస్తుడడంతో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో టీఆర్‌ఎస్‌లో రెండు మూడు గ్రూపులు ఏర్పడ్డాయ. దాంతో కింద స్థాయి నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. కొందరు నాయకులు, కార్యకర్తలు మాత్రం తటస్తంగా ఉంటూ గ్రామానికి ఏ నాయకుడు వచ్చిన జై కొడుతున్నారు. మరికొందరు అయితే ప్రత్యేకంగా తమ నాయకుడే గ్రామానికి వస్తే తప్పా కనిపించడం లేదు. ఇలా నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ గ్రూపుల కుంపట్లు మొదలైయ్యాయి. కాగా మాజీ ఎమ్మెల్యే యడ్మ కిష్టారెడ్డి మాత్రం పార్టీలోకి వచ్చి కేవలం వారం పది రోజులు కావస్తుడండంతో ఆయన మాత్రం పార్టీ కార్యక్రమాలు ఎవరు నిర్వహించినా అందులో పాల్గొం టున్నారు. ముఖ్యంగా తాను ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రత్యేక దృష్టి పెట్టానని, రాబోయే ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని కిష్టారెడ్డి తన అనుచరులతో చెబుతున్నారు. అయితే రాజకీయ ఉద్దండుడు, నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రజలను పేరుపెట్టి పిలిచే నాయకుడు కిష్టారెడ్డి ఆయన మాత్రం గ్రామాల్లో తిరిగి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయని టీఆర్‌ఎస్ పార్టీ కిందిస్థాయి కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం కారులో ఓవర్‌లోడ్ అయిందని తద్వారా తమకు మంచి అవకాశాలు ఉంటాయని వారు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఎన్నికలు జరిగాయి. కేవలం 70 ఓట్లతో కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి బీజేపీ అభ్యర్థి తల్లోజీ ఆచారిపై గెలుపొందారు. టీఆర్‌ఎస్‌లో ఉన్న గ్రూపుల కారణంగా రాబోయే ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయేననే చర్చ ఇప్పుడే మొదలైంది.