మహబూబ్‌నగర్

గొండ్యాల లిఫ్ట్ ద్వారా ఏడు గ్రామాలకు సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయిలకొండ, జూన్ 19: రాష్ట్రంలో అన్ని వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఇబ్రహింనగర్, జమార్‌పూర్, బూర్గుపల్లి గ్రామాల్లో వివిద అభివృద్ది పనులకు, శంకుస్థాపన నిర్వహించారు. ఇబ్రహింనగర్ రూ.25 లక్షలతో మిషన్ భగీరథ ట్యాంకు నిర్మాణం, రూ.41లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం భూమిపూజ, జెండా ఆవిష్కరణ నిర్వహించారు. కోయిలకొండ గ్రామానికి చెందిన కె. శ్యాంసుందర్‌కు సబ్సిడీ ట్రాక్టర్‌ను అందచేశారు. గ్రామంలో ప్రతీ ఇంటికి తాగునీటిని అందించే పైపులైన్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలోని రాగానే కేసీఆర్ రైతులను అభివృద్ధిలోకి తేవాలని రైతు రుణమాఫీ చేశారన్నారు. 7 గంటల విద్యుత్ ఇస్తున్న వ్యవస్థ నుండి నేడు రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ట్లు తెలిపారు. రైతుల భూములను పరిరక్షించేందుకే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేయడం జరిగిందన్నారు. కంప్యూటరైజ్డ్ పాస్ పుస్తకాలను దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇస్తూ పంట పెట్టుబడికి పంటకు ఎకరాకు నాలుగు వేలు అందించిందన్నారు. రైతు సర్వతోముఖాభివృద్ధికి పూర్తిస్థాయిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు దేశంలోనే మన్ననలు పొందుతున్నాయన్నారు. ఒక్క కోయిలకొండ మండలానికే 21 వేల గొర్రెలను పంపిణీ చేసినట్లు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా రాబోయో కొద్దికాలంలో ప్రతీ ఇంటికి నల్లా ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామన్నారు. మండలంలోని ఏడు గ్రామాలకు సాగునీరు అందించే గొండ్యాల పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. రాబోయో మూడు సంవత్సరాల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా మండలంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. గ్రామాల్లో సమస్యలు తన దృష్టికి తీసుకొని రావాలని పార్టీలకు అతీతంగా సమస్యల పరాష్కారానికి కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వప్న, వైస్ ఎంపీపీ శారద, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు రవి, సింగల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ సవన్వయకర్త రవీందర్‌రెడ్డి, నాయకులు కృష్ణయ్య, మల్లయ్య, భీంరెడ్డి, రాములు, నర్సిములు, ఆంజనేయులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.

కిరాణ దుకాణాల్లో టాస్క్ఫోర్స్ దాడులు
- రూ.3లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు సీజ్
దేవరకద్ర, జూన్ 19: మండల కేంద్రంలో కిరాణ దుకాణాల్లో మంగళవారం రెండు చోట్ల ఎస్పీ అనురాధ టాస్క్‌పోర్స్ ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. దాదాపు 12వేల పైగా ప్యాకెట్లు రూ.3లక్షల విలువ గల నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకోని దేవరకద్ర పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్పీ అనురాధ తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవరకద్ర ఎస్‌ఐ అశోక్‌కుమార్ తెలిపారు. ఇప్పటికైనా ఎవరి వద్ద అయనా గుట్కా ప్యాకెట్లు ఉంటే వెంటనే కాల్చివేయాలని సూచించారు. దాడుల్లో దొరికితే మాత్రం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.