మహబూబ్‌నగర్

హరితహారానికి పకడ్బందీ ప్రణాళికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 19: వర్షాలు మొదలైనందున ఈ సంవత్సరంలో చేపట్టవలసిన హరితహారం కార్యక్రమానికి సంబంధించి అవసరమైన యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి ఆదేశించారు. జూలై 2వ వారంలో హరితహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మంగళవారం సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కొత్తగా వచ్చిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామపంచాయతీలో ఒక నర్సరీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇవి వచ్చే సంవత్సరం హరితహరం కార్యక్రమానికి ఉపయోగపడేలా చూడాలన్నారు. జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. రాబోయే రెండు రోజులలో హరితహారం కార్యక్రమానికి సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారుచేసి అన్ని జిల్లాలకు పంపాల్సిన బాధ్యత అటవీశాఖ తీసుకోవాలని ఆదేశించారు. జూలై 15 కల్లా గుంతలు తీసే కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. ప్రారంభించిన 15రోజులలోపు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్లకు సూచించారు. పంచాయతీలలో ఏర్పాటు చేయబోయే నర్సరీలకు సంబంధించి ఈ నెల 25, 28వ తేదీలలో రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం హైదరాబాద్ దూలపల్లిలోని ఫారెస్టు అకాడమీలో నిర్వహిస్తామని, దీనికి అన్ని జిల్లాల అటవీశాఖ అధికారులు, వ్యవసాయ శాఖాధికారులు, ఉద్యానవన శాఖాధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు, డిఆర్‌డిఓలు, మున్సిపల్ శాఖాధికారులు పాల్గొనాలన్నారు. శిక్షణ అనంతరం జిల్లా స్థాయి, మండలస్థాయి శిక్షణ కార్యక్రమాలను తమతమ జిల్లాలలో నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు తేదిలు నిర్ణయించి జూలై 2వ వారంలోపు పూర్తి చేయాలని అన్నారు. జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొనాలని తెలిపారు. రాబోయే హరితహారం కార్యక్రమానికి పట్టణ ప్రాంతాలలోని 129 ప్రాంతాలలో 180 బ్లాక్‌లు గుర్తించడం జరిగిందని,వాటి వివరాలను సంబంధిత జిల్లాలకు పంపడం జరుగుతుందని అన్నారు. ఆరులక్షల పండ్ల మొక్కలను హరితహారంలో భాగంగా నాటేందుకు ఉద్యానవన శాఖ సిద్ధంగా ఉంచిందని తెలిపారు. వీటిలో సగం పండ్ల మొక్కలను అటవీ ప్రాంతాలలో నాటాలని, దీని వల్ల పట్టణాలు, నగరాలలో కోతుల బెడత నివారించగలుగుతామన్నారు. ముఖ్యంగా అటవీశాఖ, డీఆర్‌డీఓలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న 3వేల నర్సరీల ద్వారా మొక్కల పంపిణీ, ఉపాధిహామీ కింద అవసరమైన సిబ్బందిని సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, జిల్లా అటవీశాఖ అధికారి గంగిరెడ్డి, పశుసంవర్థకశాఖ అధికారి దుర్గయ్య, ఉద్యానవన శాఖ, గనుల శాఖ, హౌసింగ్‌శాఖ, మార్కెటింగ్‌శాఖ, పర్యాటన శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.