మహబూబ్‌నగర్

అభివృద్ధికి శాంతియుత వాతావరణమే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 19: ప్రజాస్వామ్యంలో సమాజాభివృద్ధికి శాంతియుత వాతావరణమే చాలా ముఖ్యమని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ అనురాధ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ అనురాధ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రతి గ్రామంలో శాంతియుత వాతావరణం కలిగి ఉండాలన్నారు. ప్రజలు కూడా ప్రశాంతంగా ఉంటారన్నారు. సమాజంలో శాంతి నెలకొల్పడంలో పోలీసులదే చాలా కీలకపాత్ర అని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎక్కడ కూడా రాజీపడొద్దని శాంతికి విఘాతం కలిగే వారు ఎవరైనా సరే చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందేనని పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. జిల్లాలో నేరాలను అదుపు చేసేందుకుగాను తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై విసృత్తంగా చర్చ జరగాలని అందుకుగాను పోలీసులు ప్రజల్లో మమేకమై ఉండాలని సూచించారు. పోలీసుశాఖలో పనిచేసే సిబ్బంది సమన్వయంతో ముందుకు వెళ్తే నేరగాళ్లను ఎప్పటికపుడు అణచివేయొచ్చని తెలిపారు. గ్రామాల్లో అల్లరికి కారకులవుతున్న వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. వవ్చే నెల, రెండు నెలల్లో అంతా గ్రామ పంచాయతీ ఎన్నికల సీజన్ ఉండే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో జరిగే ప్రతి విషయం పోలీసు ఉన్నతాధికారుల వరకు తెలియాల్సిందేనన్నారు. ఏదైనా గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం జరుగుతుందనే అనుమానం వస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించి తగు చర్యలకు దిగాలన్నారు. ఒకవేళ అదనపు బలగాల అవసరం కూడా ఉంటే అందుకు జిల్లా పోలీసు కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. జిల్లాలో జాతీయ రహదారులు ఉన్నందున ఎప్పటికప్పుడు పెట్రోలింగ్‌ను నిర్వహిస్తూ ఉండాలన్నారు. మైనర్లు బైక్‌లు తీసుకుని రోడ్లపైకి వస్తే వెంటనే అదుపులోకి తీసుకునే చర్యలకు కూడా వెనకాడొద్దని వారి తల్లిదండ్రులకు సైతం కౌనె్సలింగ్ ఇచ్చి అవసరమైతే వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకునే విధంగా విధులు నిర్వహించాలని తెలిపారు. పాతనేరగాళ్ల కదలికపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో అడిషన్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు భాస్కర్, శ్రీ్ధర్ పాల్గొన్నారు.