మహబూబ్‌నగర్

నెలాఖరులోగా రైతుబంధు తప్పుల సవరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, జూన్ 19: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకంలో అందజేసిన పట్టాదారు పాస్‌పుస్తకల్లో దొర్లిన తప్పులను ఈనెలఖరులోగా పూర్తి చేస్తామని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్ తెలిపారు. మరో ఐదు మండలాల్లో ధరణి పథకం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్ తెలిపారు. మంగళవారం వెల్దండ మండల తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్ అంతర్జాలంలో సరిచేస్తున్న రైతుబంధు తప్పుల సవరణను పరిశీలించారు. ఆనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కలెక్టర్ శ్రీ్ధర్ మాట్లాడుతూ జిల్లాలో 1.68 లక్షల పాస్ పుస్తకాలు అవసరం ఉండగా 2.30 లక్షల పుస్తకాలు ముద్రించినట్లు చెప్పారు. మొత్తం 2.30 లక్షాలకు గాను 2.05 లక్షల పుస్తకాల పంపిణీ చేశామన్నారు. మిగతా 25వేల పుస్తకాల్లో తప్పులు దొర్లాయని, అందులో ఆధార్ కార్డు ఇవ్వని కారణాలతో మిగిలి ఉన్నాయని వివరించారు. వీటిలో 6వేల పాస్ పుస్తకాలు తీసుకెళ్లేందుకు సంబంధిత రైతులెవరూ రావడం లేదని, వీరికి ఎన్నో పర్యాయాలు సమాచారం ఇచ్చిన ఫలితం రావడం లేదన్నారు. కోర్టు కేసులతో పాటు కుటుంబ వివాదాలు, సర్వే అసైన్డు భూములన్న వాటన్నింటిని తహశీల్దార్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారని కలెక్టర్ శ్రీ్ధర్ వివరించారు. జిల్లాలో ఒక్క బిజినేపల్లి మండలంలోనే ధరణి పథకం ప్రయోగత్మకంగా కొనసాగుతుందని, అదనంగా వెల్దండ, వంగూర్, తాడూర్, తిమ్మాజిపేట, ఉప్పునుంతల మండలాల్లో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ధరణిపై అన్ని మండలాల తహశీల్దార్, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. రైతుబంధు సవరణలపై ఎలాంటి అపోహలకు గురికావద్దని, దొంగచాటుగా చేయడం లేదని, ఎంతో పారదర్శకంగా పకడ్బందీగా చేపట్టుతున్నట్లు కలెక్టర్ శ్రీ్ధర్ స్పష్టం చేశారు. పాస్ పుస్తకాల్లో దొర్లిన తప్పుల సవరణ తహశీల్దార్ల పూర్తి బాధ్యతతో పర్యవేక్షణలో వేగవంతంగా కొనసాగుతుందని, ఈనెలఖరులోగా పూర్తి చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న పౌష్టికహరం నాణ్యత లేదని ఫిర్యాదులు చేయడంతో కలెక్టర్ శ్రీ్ధర్ అసహనం వ్యక్తం చేస్తు తమ దృష్టికి రాలేదని త్వరలోనే జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేస్తానని, ఎప్పటి కప్పుడు పరిశీలిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈసమావేశంలో కల్వకుర్తి ఆర్డీవో రాజేష్‌కుమార్, తహశీల్దార్ జి.సైదులు, వ్యవసాయ అధికారిణి మంజుల, సిబ్బంది వెంకటరమణ, రాఘవేందర్‌రావు, నవీన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అంతకముందు తహశీల్దార్ కార్యాలయంలో రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు తీసుకున్న హరితహారంపై డీఆర్‌డీవో సుధాకర్, డీపీవో వెంకట్వేర్‌రావులతో కలెక్టర్ శ్రీ్ధర్ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.