మహబూబ్‌నగర్

పేదల అపన్నహస్తం సీఎంఅర్‌ఎఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, జూన్ 21: పేదల అపన్నహస్తం ముఖ్యమంత్రి సహాయనిధి పథకమని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గూర్క జూపాల్‌యాదవ్ అన్నారు. గురువారం వెల్దండ మండల కేంద్రంలో అచ్చంపేట మండలం అక్కారం గ్రామానికి చెందిన సోనాలికి సీఎంఅర్‌ఎఫ్ పథకం కింద మంజూరైన 45వేల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అందజేశారు. ఈసందర్భంగా జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఅర్ ఎన్నో బృహత్తర పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఇచ్చిన హమీలనే కాకుండా మరిన్ని ఉహించని సరికొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజారంజాక పాలనను టీఅర్‌ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. ముఖ్యమంత్రి పాలనకు దేశానికి దిక్సూచిగా మారాయన్నారు. సంబండ వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నిర్విరామంగా పాటు పడుతున్నారని ఆయనకు అందరూ అండగా నిలువాల్సిన అవసరం ఎంతైనా ఉందని జైపాల్‌యాదవ్ అన్నారు. అర్థికంగా లేని నిరుపేద ప్రజలకు వైద్యం భారం కావద్దని భావించిన ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద అర్థిక సహాయం చేసి అదుకుంటుందని అన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు అప్పల శేఖర్‌గౌడ్, నాగేష్, చంద్రునాయక్, లక్ష్మణచారి, చంద్రునాయక్, తదితరులు పాల్గొన్నారు.