మహబూబ్‌నగర్

‘నిత్య జీవితంలో యోగా భాగం కావాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోస్గి, జూన్ 21: భారతీయ జీవన విధానంలో అంతర్భాగమై సాగుతూ వస్తున్న యోగాను ప్రతి ఒక్కరు నిత్య జీవితంలో ఒక భాగంగా అలవర్చుకోవాలని వివేకానంద సామాజిక సేవాసమితి రాష్ట్ర ప్రచారక్ క్రిష్ణస్వామి అన్నారు. గురువారం పట్టణంలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర శివసాయి అయ్యప్ప దేవాలయ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వివేకానంద సామాజిక సేవాసమితి రాష్ట్రప్రచారక్ క్రిష్ణస్వామి ముఖ్య అతిథఙగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినిత్యం కొంత సమయం యోగా చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల సుఖవంతమైన జీవితాలకు అలవాటు పడడం వల్ల అనేక శారీరక, మానసిక రుగ్మతలు కలుగుతున్నాయని సంపూర్ణ ఆరోగ్యానికి యోగానే పరిష్కారమని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదే క్రమంలో మండలంలోని కడంపల్లి, ముశ్రీఫా పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించి పలు ఆసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో పతాంజలి యోగా జిల్లా అధ్యక్షులు గంగాధర్, రఘోత్తమ్, తిమ్మాయిపల్లి హన్మంతు, మ్యాకల నర్సిములు, చల్ల రఘురాములు, వేణుగోపాల్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
యోగా ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే చిన్నారెడ్డి
వనపర్తి, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకొని రాజబహుదూర్ వెంకట్‌రాంరెడ్డి మోడల్ స్కూల్ విద్యార్థులచే వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి వనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగాతో శరీరక, మానసిక ఉల్లాసం పెరుగుతుందని అన్నారు. నిత్యం వేగవంతమైన కాలంతో పోటీ పడుతూ శరీరక, మానసిక, ఒత్తిడికి గురవుతున్న సందర్బంలో మనిషికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు శంకర్‌ప్రసాద్, సతీష్, వెంకటేష్ తదితరులు పాల్గోన్నారు.