మహబూబ్‌నగర్

అభివృద్ధిలో తెలంగాణ నంబర్-1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 21: ముఖ్యమంత్రి కేసీ ఆర్ నిరంతర కృషి వల్ల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం నంబర్-1 స్థానంలో నిలిచిందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం మండలంలోని ఒబుల్లాయిపల్లి, కోడూర్‌తాండ, తెలుగుగూడెం, అప్పాయపల్లి గ్రామాల్లో సుమారు రూ.1.45కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీ ఆర్ శ్రమిస్తున్నారని ఆయన నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే నంబర్-1గా నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల అధికారులు, ఉద్యోగుల్లో అంకితభావం పెరిగిందని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తున్నారని ఆయన కొనియాడారు. ప్రతి గ్రామానికి పక్కా గ్రామపంచాయతీ భవనాలను నిర్మించి ఇవ్వడమే లక్ష్యమని ప్రజల వద్దకు పాలన సౌలభ్యం కోసమే రాష్ట్రంలో నూతన జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కళ్యాణలక్ష్మీ సొమ్ము పెంపుతో పాటు మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ, డబుల్‌బెడ్‌రూం పథకాలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశాయని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగనప్పటినికి రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధిలో ఉరకలు వేస్తుందని అన్నారు. రైతును రాజును చేయడమే లక్ష్యంగా వ్యవసాయానికి పెద్దపీట వేయడం జరిగిందని అందులో భాగంగానే రైతులు అప్పుల పాలు కాకుండా రైతుబంధు పథకం ద్వారా ఏడాదిలో రెండు పంటలకు ఎకరానికి రూ.8వేల పెట్టుబడి సహయం అందించడంతో పాటు రైతుబీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టిందని అన్నారు. అదేవిధంగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని రాయల్ ఫంక్షన్‌హల్‌లో భారత్‌స్వాభిమాన్ ట్రస్ట్, ఆయూష్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హజరై యోగాసానాలు వేశారు. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ 7వ వర్థంతి సందర్భంగా పట్టణంలోని పద్మావతీ కాలనీలో గల జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్, ఎంపీపీ సావిత్రి, జడ్పీటీసీ శ్రీదేవి, కౌన్సిలర్లు కృష్ణమోహన్, హాది, నాయకులు గోపాల్‌యాదవ్, సుదీప్‌రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.