మహబూబ్‌నగర్

యోగాతో జీవన ప్రమాణం పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాపూర్, జూన్ 21: క్రమశిక్షణతో యోగా రోజు చేయడం వల్ల మనిషి జీవన ప్రమాణం పెరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్‌లో జిల్లా పతాంజలి అధ్యక్షులు అర్జున్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన యోగా కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచం మొత్తం జరుపుకుంటోందని, యోగా శక్తిని భారతదేశం నలుదిశలా చాటుతోందన్నారు. ప్రస్తుత కాలంలో మనిషి పనుల వత్తిడిలో ఉండి ఆహారపు అలవాట్లు, తీరికలేని జీవితం గడపడం వల్ల రోగాల బారిన పడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తి ప్రతిరోజు కొంత సమయాన్ని యోగా కోసం కేటాయించుకోవాలని, దీనివల్ల డబ్బు ఆదా అవడంతోపాటు ఆరోగ్యంగా జీవితం గడుస్తుందని అన్నారు. వంద సంవత్సరాలకు పైగా జీవిస్తున్న వారిని ఒకసారి గమనిస్తే అత్యధికశాతం యోగా, వారి ఆహారపు అలవాటు వల్లనే దీర్ఘకాలికంగా జీవిస్తున్నారనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలన్నారు. ఇది ఇలా ఉంటే పట్టణంలో ఆడిటోరియం నిర్మాణానికి రూ.ఐదుకోట్లు, యోగా కేంద్రానికి రూ.48లక్షలు, తహశీల్దార్ కార్యాలయం నిర్మాణానికి రూ.46 లక్షలు నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. అనంతరం ఆచార్య జయశంకర్ ఏడో వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఆయన వెంట ఎంపీపీ చిన్న నిరంజన్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు వి.శ్రీనివాసరావు, నర్సింహ్మారావు, సత్యం, మేకల రాముడు, మహేష్, రామన్‌గౌడ్ పాల్గొన్నారు.