మహబూబ్‌నగర్

కొడంగల్ జడ్పీటీసీ సభ్యురాలిగా ఎల్లమ్మ ప్రమాణస్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 22: గత కొనే్నళ్లుగా కొడంగల్ జడ్పీటీసీ స్థానంపై వివాదం తలెత్తింది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శరణమ్మ కొడంగల్ జడ్పీటీసీగా గెలుపొందింది. అయితే ఆమెపై పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఎల్లమ్మ టీడీపీ జడ్పీటీసీగా గెలుపొందిన శరణమ్మ ఎన్నిక చెల్లదంటూ కోర్టును ఆశ్రయించారు. దాంతో గత నెలరోజుల క్రితం కాంగ్రెస్ అభ్యర్థిగా జడ్పీటీసీగా రెండవస్థానంలో నిలిచిన ఎల్లమ్మకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. కొడంగల్ జడ్పీటీసీగా ఎల్లమ్మను కొనసాగించాలని జిల్లా అధికారులను కోర్టు అదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కొడంగల్ జడ్పీటీసీ సభ్యురాలిగా ముదిగండ్ల ఎల్లమ్మను శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ వెంకట్‌రావ్ ప్రమాణస్వీకారం చేయించారు. గత జడ్పీటీసీగా కొనసాగిన శరణమ్మకు నలుగురు సంతానం ఉన్నారని తెలడంతో ఆమె ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఎన్నికల నిబంధన మేరకు రెండవస్థానంలో నిలిచిన ఎల్లమ్మకు అవకాశం దక్కింది. కాగా ఎల్లమ్మ జడ్పీటీసీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగగా ప్రస్తుతం ఆమె టీ ఆర్ ఎస్‌లో ఉన్నారు. మాజీ జడ్పీ వైస్ చైర్మన్ క్రిష్ణ సతీమణి అయిన ఎల్లమ్మ ఓ దఫా కొడంగల్ ఎంపీపీగా కూడా కొనసాగింది. ప్రస్తుతం ఆమె హస్నాబాద్ సర్పంచ్‌గా కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జడ్పీటీసీగా ప్రమాణం చేయడంతో సర్పంచ్ పదవికి రాజీనామా చేయనున్నారు.