మహబూబ్‌నగర్

చినుకు రాలదు...కరవు వీడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయిలకొండ, జూన్ 22: కరవు కోయిలకొండ మండలాన్ని వీడేలా లేదు..ఆనేక గిరిజన తాండలు జనం లేక బోసిపోతున్నాయి..వర్షాధార పంటలు మండలంలో విత్తినా వరుణుడు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు...చేతినిండా పనిలేక కుటుంబ పోషణ భారమైంది..ప్రతీ నిత్యం వందల సంఖ్యలో రైతుకూలీలు కుటుంబాలతో కలిసి ముంబాయి, పూణె, కర్ణాటక తదితర ప్రాంతాలకు వలస బాట పట్టారు. మండలం నుండి వేళ్లే ముంబాయి బస్సుకు రద్దీ రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రభుత్వం పసులు కల్పించడానికి, వలస నివారణకు ప్రవేశపెపేట్టిన ఉపాధి హమీ పథకం ప్రజలకు ఉపయోగం లేకుండా పోతోంది.
ప్రస్తుత వర్షాభావ పరిస్థితితో గ్రామాల్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ప్రభుత్వం పంట కోసం ఎకరాకు నాలుగు వేలు ఇచ్చినా వర్షాలు లేక రైతులు ఆలోచనలో పడ్డారు. రోహిణీ కార్తిలో వేయాల్సిన వర్షాధార పంటలు చాలా తక్కువ మొత్తంలో సాగు చేయడం జరుగుతుంది. వర్షాలు కురవక వేల ఎకరాల్లో రైతులు సాగుచేసిన వర్షాధార పంటలు ఇప్పటికే ఎండి పోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే వర్షాలు కురిసినా మొక్కల నుండి ఎదుగుదల లేక దిగుబడి తగ్గిపోతుందని రైతులు అభిప్రాయ పడుతున్నారు. 45 గ్రామపంచాయతీలు గల కోయిలకొండలో 35 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వ్యవసాయమే జీవనోపాధిగా ఇక్కడి ప్రజలు జీవనం గడుపుతున్నారు. 10 నోడిఫైడ్ చెరువులు, 80 కి పైగా చిన్నా చితకా కుంటలు ఉన్నాయి. ఇక గత 25 సంవత్సరాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక అనేక చెరువులు నిండక వాటి కింద ఉన్న నాణ్యమైన పొలాలు బీడు భూములుగా మారిపోయాయి. ఇక ఇప్పటికే మండలంలోని 65 వేల జనాభాలో 10 వేలకు పైగా ఇతర రాష్ట్రాల్లో రోజు కూలీలుగా ఉన్నారు. ఇక రైతులు వ్యవసాయం అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
దీనికి తోడు రైతులు ఎంతో ఆప్యాయంగా చూసుకొనే తమ పశువులను మేతలేక దేవరకద్ర, కోస్గి, మద్దూర్ పశువుల సంతలకు తరలిస్తున్నారు. పాతికేళ్ల కర వు వీడి కోయిలకొండ మండలంలో చెరువులు కుంటలు నిండి తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయో అని రైతులు ఎదురుచూస్తున్నారు.