మహబూబ్‌నగర్

ప్రగతిభవన్‌లో కూర్చుంటే ప్రజల బాధలు ఎలా తెలుస్తాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోస్గి, జూన్ 22: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో కూర్చుని తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందారని సంతోషం వ్యక్తం చేయడం కాదు... ప్రజల్లోకి వచ్చి వారి సమస్యలను పరిష్కరించాలని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కోస్గి మండలపరిధిలోని పోలేపల్లిలో ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోలేపల్లి నుండి కోస్గి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కోస్గి పట్టణంలోని బీసీ కాలనీలో కాంగ్రెస్ జెండాను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు ఇతర పార్టీల నుండి నాయకులను కొంటే సరిపోదని సరైన నాయకత్వంతో నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకులను కొంటే బాగుంటుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ నాయకులు కొంటున్న నాయకులను ఆ స్థాయిలో ఉంచిన ఘనత మాదేనని ఎద్దేవా చేశారు.
కొడంగల్ నియోజకవర్గానికి మొదటిసారిగా వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలు 7వేల మేజారిటీతో గెలిపించారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క కోస్గి మండలం నుండే 10వేల మెజారిటీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఆంధ్రా పాలకుల వివక్షతకు గురైన తెలంగాణ ప్రజలు కొట్లాడి తెలంగాణ సాధించుకుంటే గడిచిన నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమేనన్నారు.
అనంతరం టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు 100మంది రేవంత్‌రెడ్డి సమక్ష్యంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో నరేందర్, అంజయ్య, రఘువర్థన్‌రెడ్డి, ఆసిఫ్, ఇబ్రహిం, గౌస్, గోవర్థన్‌రెడ్డి, వెంకటయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.