మహబూబ్‌నగర్

హకీ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, జూన్ 22: వనపర్తి హాకీ అకాడమీలో శిక్షణ పొందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి టి. పద్మారావుగౌడ్ అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో రూ. 2కోట్ల 40లక్షల వ్యయంతో నిర్మించిన తెలంగాణ హాకీ అకాడమిని ప్రారంభించారు. అలాగే రూ. 2కోట్ల 65లక్షల వ్యయంతో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ ఔట్‌డోర్ స్టేడియంను, ఇండోర్ స్టేడియంను, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హాకీ అకాడమి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ వనపర్తి హాకీ అకాడమిలో శిక్షణ పొందిన హాకీ క్రీడాకారులు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. వనపర్తి జిల్లా హాకీ క్రీడకు అణిముత్యతంలా పెట్టని కోటని ప్రశంసించారు. వనపర్తి క్రీడలకు ప్రత్యేకించి హాకీ క్రీడకు పెట్టింది పేరు అని, అందువల్లనే జిల్లాలో హాకీ అకాడమీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూ. కోటి వ్యయంతో ఇండోర్ స్టేడియం జిల్లా కేంద్రంలో నిర్మించడం సంతోషమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు,క్రీడాకారులకు ప్రాధాన్యతను ఇస్తున్నదని, అందులో భాగంగానే మండల స్థాయి మొదలుకొని జాతీయ స్థాయి వరకు వివిధ క్రీడలో ప్రతిభ కనబర్చిన వారికి రూ. 10లక్షల నుండి 50లక్షల వరకు రివార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని గొప్ప క్రీడాకారులుగా రాణించాలన్నారు. అంతకు ముందు మంత్రి ఎక్సైజ్ సూపరింటెండెండ్ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్బంగా గౌడ, గీత కార్మికులతో మాట్లాడుతూ గీత కార్మికుల హక్కులను కాపాడడంతో పాటు వారి సంక్షేమం కోసం కృషి చేస్తూ అండగా ఉంటుందన్నారు. గీత కార్మికుల రెంటల్స్‌ను రద్దు చేయడంతో పాటు పాత బకాయిలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా గీత కార్మికులు కల్లు గీసి అమ్ముకొనే అవకాశం కల్పించిందన్నారు. హైదరాబాద్‌లో గీత భవన్ కోసం ప్రభుత్వం అయిదు ఎకరాల స్థలాన్ని రూ. 5కోట్లు కేటాయించిందన్నారు. అవసరమయితే మరిన్ని నిధులు ఇప్పిస్తామని ప్రకటించారు. ఈసందర్బంగా గీ కార్మికులు మంత్రిని ఘనంగా సన్మానించారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లా క్రీడలకు , క్రీడాకారులకు ప్రసిద్ధి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం ఇస్తుందని , వాలిబాల్ క్రీడకు జాతీయ స్థాయిలో నాయకత్వం వహిస్తున్న యశ్వంత్‌కుమార్ , అలాగే షెపక్‌తక్రాలో రాణిస్తున్న నవత,కిక్‌బాక్సింగ్‌లో ప్రతిభ కనబరుస్తున్న భరత్‌కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రోత్సాహకాలు అందించామన్నారు. రాబోయే కాలంలో ప్రతి మండల కేంద్రంలో క్రీడ ప్రాంగణాలు ఉండాలని , ప్రభుత్వం క్రీడలతో పాటు గురుకుల విద్యాలయాల ద్వారా నాణ్యమైన విద్యాను అందిస్తున్నదని, తెలంగాణలో విద్యార్థులు, క్రీడాకారులు రాబోయే తరం కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపదించాలన్నాదే తమ ధ్యేయమన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లా విద్యాతో పాటు క్రీడలకు ప్రసిద్ధి అని , ప్రధానంగా హాకీ , పుట్‌బాల్ క్రీడాకారులు ఉన్నారని అన్నారు . వనపర్తి హాకీ అకాడమీ నుండి ధ్యాన్‌చంద్ లాంటి వారు తయారు కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం వున్న రెండు హాకీ ఫీల్డులలో ఒకదానిని టర్న్ గ్రౌండ్‌గా మార్చాలని ప్రస్తుతం ఉన్న స్టేడియం గ్రౌండ్‌లో స్విమ్మింగ్‌పూల్‌ను ఏర్పాటు చేయాలని, పెబ్బేరులో పుట్‌బాల్ అకాడమిని ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు.
రాష్ట్ర క్రీడల అభివృద్ది సంస్థల చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లాను క్రీడల హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు . జిల్లాలో హాకీకి మరింత పేరు తీసుకురావాలని కోరారు. రాష్ట్ర క్రీడల అథారటీ ఎండి దినకర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల పాలసీ దిన దిన ప్రవర్తమానం కావాలని అన్నారు. వనపర్తి జిల్లాను క్రీడలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని, పట్టణం విద్యాతో పాటు క్రీడల్లో రాణించాలని, హాకీ అకాడమి మొదటి బ్యాచ్‌లో ఉన్న 24 మంది క్రీడాకారులు అవార్డులు తెచ్చేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, క్రీడల అభివృద్ది అధికారి కళ్యాణ్‌గౌడ్, హాకి క్రీడాకారుడు నారాయణదాస్, జేసి చంద్రయ్య, ఆర్డివో చంద్రారెడ్డి, కౌన్సిలర్లు జ్యోతి, శ్రీదర్,లోక్‌నాథ్‌రెడ్డి, గట్టుయాదవ్, మార్కెట్ కమిటి చైర్మన్ రవి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ భాస్కర్, కాంగ్రెస్ నాయకులు శంకర్‌ప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.