మహబూబ్‌నగర్

ప్రజాప్రతినిధులంటే తమాషాగా ఉందా...సమాచారం ఇవ్వరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 22: తమాషాగా ఉందా..జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గురించిగానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించిగానీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ ప్రకారంగా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా పరిషత్ 15వ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి హాజరయ్యారు. సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని నియోజకవార్గల్లో సమాన అభివృద్ధి జరుగుతుందని ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడాలేకుండా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ప్రతిసారి జడ్పీ సమావేశంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు పలు సమస్యలపై లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు అధికారులు చెప్పాల్సి ఉందని క్షేత్ర స్థాయిలోనే పరిష్కారమయ్యే సమస్యలు కూడా జడ్పీ సమావేశం వరకు రావడం దురదృష్టకరమని అన్నారు. ఎంపిడీవోలు సక్రమంగా పని చేయడంలేదంటే అందులో ప్రజాప్రతినిధుల తప్పుకూడా ఉంటుందని అన్నారు. ఎదో సమయం దొరికినప్పుడు మాత్రమే ప్రశ్నిస్తామనుకోవడం మానుకుని నిరంతరంగా ఓ పని చేయాలనే తపన ఉండాలని అన్నారు. ప్రజలను సైతం చైతన్యం చేస్తే అధికారులు పని ఎలా చేయరో అప్పుడు తెలుస్తుందని అన్నారు. ఉపాధి హామీ నిధులు కావాలంటే గ్రామాల్లో 60 శాతంపైగా బాబ్‌కార్డులు ఉన్న కూలీలు పనికి వెళ్లి వందరోజులు పూర్తి చేసుకోవాలని సూచించారు. అలాంటి గ్రామాలకు మాత్రమే సీసీ రోడ్లు మంజూరు చేస్తామని చెప్పారు. జిల్లాలో ఇంత అభివృద్ధి జరుగుతుంటే అనుకూలమైన ఫలితాలు ఉండాలని కేవలం వ్యవసాయశాఖ అధికారుల పనితీరు చాలా బేష్‌గా ఉందని ప్రజల్లో వస్తున్న నిజం అని వ్యవసాయశాఖ అధికారులను తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పారు. ఉపాధిహామీ నిధులు ఎలాంటివి పెండింగ్‌లో లేవని అన్నారు. క్షేత్ర స్థాయిలో డెటా ఎంట్రీకాకుంటేనే బిల్లులు రాలేకపోతాయని తెలిపారు. ప్రస్తుతం జడ్పీటీసీలు, ఎంపీపీలు లేవనెత్తిన ప్రశ్నలంటింకిని తాము సమాధానం చెప్పడమేకాకుండా వాటికి పరిష్కారం చూపేవిధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. మరో వారం రోజుల వ్యవధిలో ప్రత్యేక జడ్పీ సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశం కూడా రెండు రోజుల పాటు నిర్వహిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రత్యేక సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు తప్పకుండా హాజరుకావాలని అందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. ప్రతి సమస్యకు పరిష్కారం తప్పకుండా ఉంటుందని అర్ధం చేసుకునే విధానంఉండాలని సూచించారు. జడ్పీటీసీలు, ఎంపీపీలకు ప్రభుత్వం మంచి గౌరవం ఇస్తు గౌరవేతనంతో పాటు నిధుల కేటాయింపులో కూడా పెద్దపీట వేయడం జరిగిందన్నారు. మరో రెండేళ్లలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని ఆ అడుగులు పడ్డాయని అన్నారు. అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే ప్రభుత్వానికి మరింత మంచిపేరు వస్తుందని అన్నారు. రైతుబీమా పథకం సర్వేను పూర్తి స్థాయిలో నిర్వహించి రైతులకు వందశాతం లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ శే్వతామహాంతి, జడ్పీ సిఇఓ కొమరయ్య, జేసి వెంకట్‌రావు తదితరులు పాల్గొన్నారు.