మహబూబ్‌నగర్

పునరావాస కేంద్రం సమస్యలు పరిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి,జూలై 14: శంకర సముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న కానాయపల్లి గ్రామం స్థానంలో నిర్మిస్తున్న పునరావాస కేంద్రానికి సంబంధించిన అన్ని సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కానాయపల్లి ముంపు పునరావాస బాధితులు , ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కానాయపల్లి పునరావాస కేంద్రం సమస్యలను తీర్చేందుకు 2014 నుండి కృషి చేయడం జరుగుతుందని , ప్రభుత్వ పరంగా గ్రామస్థులకు రావాల్సిన లబ్ధి అంతటిని ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానాయపల్లి పునరావాస బాధితుల డిమాండ్ మేరకు రిజర్వాయర్ నిర్మాణంలో భూములు, ఇండ్లు, కోల్పోయిన బాధితులకు సంబందించిన పిల్లలు 18 సంవత్సరాలు చేసుకొని ఉంటే ఆర్ అండ్ ఆర్ బెనిఫిట్స్ ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకేళ్తామని అవసరమయితే రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రితో మాట్లాడుతానని చెప్పారు. సోసియే ఎకానమిక్ సర్వేలో సాంకేతిక కారణంగా ఎవ్వరి పేర్లయినా తప్పిపోయి ఉంటే రికార్డులను పరిశీలించి సరిదిద్దుతామన్నారు. ప్రాజెక్టు కింద భూములు, ఇండ్లు కోల్పోయి గ్రామంలో లేనవారిగా గుర్తించిన 95 మంది లబ్దిదారులకు కూడా ఆర్ అండ్ ఆర్ కింద బెనిఫిట్స్ ఇచ్చే విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్ అండ్ ఆర్ కేంద్రం ముందు పంట పొలాలకు, గిరిజన తండాలకు వెళ్లేందుకు గాను రహదారులు కావాలని పునరావాస బాధితులు కోరగా అందుకు ఆయన స్పందిస్తూ తక్షణమే వాటికి సంబంధించిన అంచనాలను రూపొందించి సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ ఆర్ కింద పునరావాస కేంద్రంలో చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందని , ప్రధానంగా కానాయపల్లి పునరావాస కేంద్రాన్ని అద్భుతమైన మోడల్ కేంద్రంగా తీర్చి దిద్దుతామని , భవిష్యుత్తులో వనపర్తి, కొత్తకోటల మంద్య ప్రాముఖ్యతను సంతరించుకునే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. జిల్లా కలెక్టర్ శే్వతామహంతి మాట్లాడుతూ శంకర సముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా 1129 మందిని నిర్వాసితులుగా గుర్తించడం జరిగిందని ,పునరావాస చట్టం ప్రకారం వీరందరికీ అందించాల్సిన వివిధ రకాల బెనిఫిట్స్‌తో పాటు కొత్తగా నిర్మిస్తున్న ఆర్ అండ్ ఆర్ కేంద్రంలో వౌలిక సదుపాయాలైన విద్యుత్తు, తాగునీటి వంటి సౌకర్యాలను కల్పించడం జరుగుతుందన్నారు. రహదారులు, అంగన్‌వాడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తదితర పనులు జరుగుతున్నాయని , పునరావాస కేంద్రం లబ్దిదారుల కోరిక మేరకు ప్రహారి నిర్మాణం విషయం ఆలోచిస్తామని చెప్పారు. ఆర్‌అండ్ ఆర్ పునరావాస కేంద్రంలో సౌకర్యాల ఏర్పాటుకు గాను రూ.14 కోట్లు మంజూరు కాగా ఇప్పటి వరకు రూ. 5కోట్లను ఖర్చు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హౌజింగ్ గ్రాంట్‌ను రూ.50వేల నుండి రూ. లక్ష 25వేలకు పెంచడం జరిగిందని , ముంపు బాధితులకు ప్రభుత్వం తరపున అందించాల్సిన పూర్తి సహకారాన్ని అందిస్తామని , పునరావాస కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ శంకర సముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురైన కానాయపల్లి గ్రామస్తులకు సాద్యమైనంత లబ్ది చేకుర్చాలన్నాదే తమ అభిమతమని , అర్హులందరికి పునరావాస ఫలాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని , సోషియో ఎకానమిక్ సర్వేలో తప్పి పోయిన వారి పేర్లను జాబితాలో చేర్చాలని అలాగే 18 సంవత్సరాలు నిండిన వారికి ఇళ్ళ స్థలాలు, ఆర్ అండ్ ఆర్ బెనిఫిట్స్ ఇవ్వాలని , ఖాళీ స్థలాలకు కూడా నష్టపరిహారం వెచ్చించాలని బాధితుడు కోరుతున్నప్పుడు సమావేశం దృష్టికి తీసుకోచ్చారు. గ్రామస్థులు కూడా వీలైనంత త్వరగా రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.
అంతకు ముందు కానాయపల్లి ముంపు బాధితుల తరపున హేమవర్దన్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, రావులసురేంద్రనాథ్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, శ్రీనివాసులు, శంకర్‌గౌడ్, ధానయ్య తదితరులు మాట్లాడుతూ పునరావాసంలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన యువకులతో పాటు యువతులను కూడా ఎస్ ఈ ఎస్ జాబితాలో చేర్చాలని, మల్లన్నసాగర్‌ప్రాజెక్టు కింద ఇస్తున్నట్లుగా డబుల్‌బెడ్రూం ఇళ్ళు మంజూరు చేయాలని , ఎస్ ఈ ఎస్‌లో తప్పి పోయిన నిర్మాణాలను జాబితాలో చేర్చాలని , సర్వే తరువాత కొత్తగా నిర్మించుకున్న నిర్మాణాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని, కొత్త ఎస్ ఎస్ ఆర్ రెట్ల ప్రకారం నష్టపరిహారం అందించాలని , బాధితుల కుటుంబాలలోని వారికి ఉద్యోగాలు ఇవ్వాలని , గ్రామంలో లేని 95 మంది లబ్దిదారులకు కూడా పూర్తి బెనిఫిట్స్ ఇవ్వాలని ,పునరావాస కేంద్రం నుండి పంట పొలాలకు , తాండలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని , ఎస్ ఈ ఎస్‌లో తప్పిపోయిన లబ్దిదారులను చేర్చాలని కోరారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి జేసి చంద్రయ్య, ఆర్డీవో చంద్రారెడ్డి, ఎంపిపి గుంతవౌనిక, బీమా ప్రాజెక్టు ఎస్ ఈ భద్రప్ప, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ వెంకటయ్య, ప్రాజెక్టు ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.