మహబూబ్‌నగర్

పేదలకు కార్పొరేట్ వైద్యసేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, జూలై 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారికి కార్పొరేట్ వైద్యసేవలు అందిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండల కేంద్రంలో రూ.4.75 కోట్ల ఖర్చుతో 30 పడకల ఆసుపత్రి గా స్థాయి పెంచిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే చిన్నారెడ్డి, కలెక్టర్ శే్వతామహంతిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్ర భుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తూ పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నాదన్నారు. ఈ సదుపాయాలను ప్రజలు సద్వీనియోగం చేసుకోవాలని ఆయన కోరా రు. కేసీఆర్ కిట్టు అమలు తరువాత రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులలో రోగుల సంఖ్య పెరిగిందని ము ఖ్యంగా ప్రసవాలు అనూహ్యంగా పెరిగాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొ ని రాష్ట్రప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆ సుపత్రుల్లో వౌలిక వసతులతో పా టు వివిధ రకాల పరీక్షలకు సంబంధించిన పరికరాలను ఏర్పాటు చేస్తున్నాదని తెలిపారు. అందులో భాగంగానే ఖిల్లాఘనపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా స్తాయి పెంచినట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ శే్వతామహంతి, ఎమ్మెల్యే డాక్టర్ జీ.చిన్నారెడ్డి, ఎంపీపీ కృష్ణనాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు, ప్రోగ్రాం అధికారి రవిశంకర్,్భక్షపతి, జిల్లా ఇమ్యునైజైషన్ అధికారి డాక్టర్ శ్రీనివాసులు, తహశీల్దార్ పాల్గొన్నారు.
భూ రికార్టుల ప్రక్షాళన అస్తవ్యస్థం
* టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్

మహబూబ్‌నగర్, జూలై 17: జిల్లా లో భూరికార్టుల ప్రక్షాళన అస్తవ్యస్థంగా మారిందని, ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రైతులకు సంబంధించిన భూముల్లో మటుమాయం అవుతున్నాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ ఆరోపించారు. మంగళవారం మహబూబ్‌నగర్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట నాసుపుస్తకాలు, రైతుబంధు పథకంలో చెక్కులు అందని రైతులతో కలిసి టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ మండలంలోని వివిధ గ్రామాల రైతులు ఈ ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ముఖ్యఅతిథిగా హజరైన టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న భూరికార్డుల ప్రక్షాళన జిల్లాలో వేలాది మంది రైతులకు ఇబ్బంది కలిగించిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అధికారుల తప్పిదం, వారి నిర్లక్ష్యం కారణంగా రైతులకు సంబంధించిన భూములు ఆన్‌లైన్‌లో పాసుపుస్తకాల్లో నమోదు కాలేదని తెలిపారు. కొంతమంది రైతులకు భూములు ఉన్నప్పటికిని పాసుపుస్తకాలు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. మరికొంతమంది రైతులకు పాసుపుస్తకాలు వచ్చిన అందులో గుంటల్లో భూము లు పాసుపుస్తకాల్లో నమోదు కాలేదని తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగిన ఇంకా ఆ సమస్యకు పరిష్కారం లభించడం లేదన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు షౌకత్‌అలీ, మల్యాద్రిరెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, కాశీం, వెంకన్న, గోపాల్‌రెడ్డి, రామకృష్ణ, చెన్నయ్య పాల్గొన్నారు.