మహబూబ్‌నగర్

జీవోల పేరుతో మోసం చేస్తున్న కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూలై 17: జీవోల పేరుతో గద్వాల ప్రజలను మోసం చేస్తూ ఎన్నికల జిమ్మికల కోసమే తెరాస ప్రభుత్వము ఆర్భాటాలకు పాల్పడుతోందని బహుజన లెప్ట్ ఫ్రంట్ నియోజకవర్గ కన్వీనర్, కోకన్వీనర్ రంజిత్‌కుమార్, వెంకటస్వామి విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లడుతూ సీయం కేసీఆర్ గద్వాల బహిరంగ సభలో గద్వాల అభివృద్ధికి రూ.100కోట్లు, బస్టాండు, గుర్రంగడ్డ బ్రిడ్జి నిర్మాణం, బృందావనం పార్కు, ఏరియా ఆసుపత్రితో 300 పడకలు ఏర్పాటు చేస్తానని చెప్పి నేటి వరకు ఎలాంటి జీవోలు, నిధులు మంజూరు చేయలేదని వారు పేర్కొన్నారు. పుష్కరా ల సమయంలో అలంపూర్ బస్టాండు నిర్మాణాకి కృషి చేస్తానని హమీలు ఇచ్చారని, గతంలో ఇచ్చిన హామీలకే దిక్కులేని పరిస్థితి లేదని, ఎలాంటి స్పష్టమైన వైఖరీలు తీసుకోలేదని వారు పేర్కొన్నారు. గత పాలకులు ఉమ్మడి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తానని చెప్పి పాలమూరు జిల్లా ప్రజలను మోసం చేశారని, స్వరాష్ట్రంలో నేటి పాలకులు కూడా హమీల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ధ్వజమెత్తారు. బీఎల్‌ఎఫ్ సభ్యులు అతికూర్ రెహ్మాన్, బుచ్చిబాబు, వీవీ నర్సింహ, రంగస్వామి, ఉప్పేరు నర్సింహ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
భూ సమస్యలను పరిష్కరించండి
* ఆర్డీవో చంద్రారెడ్డి
కొత్తకోట,జూలై 17: భూములకు సంబందించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్డీవో చంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ధరణి లో విరాసత్తు, డిజిటల్ కీతో పాటు వెంటనే పరిష్కరించాలని, కానాయపల్లి ముంపు బాధితుల నుంచి సి ఫాం ఎన్ని సేకరించారో, చనిపోయిన కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారన్నది తహశీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమడబాకుల గ్రామంలో రెండు పడకల గదుల సంబంధించిన భూముల వివరాలు , మూడేకరాల భూ పంపిణిపై ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. తహశీల్దార్ లక్ష్మికాంత్, ఆర్‌ఐ రాఘవేందర్‌రెడ్డి, వీఆర్వో పాల్గొన్నారు.