మహబూబ్‌నగర్

నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, జూలై 17: హరితహరంలో భాగంగా ఆయా గ్రామాలకు నిర్దేశించిన లక్ష్యాన్ని చెరుకోవాలని కలెక్టర్ శే్వతామహంతి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సంకిరెడ్డిపల్లిలో పాఠశాల ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి మొక్కలను ఎన్ని నాటాలని ఏపీవోను అడిగి తెలుసుకున్నారు. కాగా గ్రామానికి 30వేల మొక్కలు నాటాలని అందుకు ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్ల ఇరువైపున,ప్రతి ఇంటి ముందు , ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలన్నారు. గ్రామంలో నిర్దేశించిన లక్ష్యాన్ని చెరకుంటే అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నాటిన మొక్కను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గ్రామాన్ని పచ్చదనం చేయాలన్నారు. మొక్కలు సమృద్దిగా ఉంటేనే వర్షాలు పుష్కలంగా పడుతాయని ఆమె అన్నారు. అనంతరం మదనాపురం మండలంలోని డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని ఆమె పరిశీలించారు. ఆమె మొక్కలు నాటి నీరు పోశారు. డీఆర్‌డీఏ పీడీ గణేష్, ఎంపిపి గుంతవౌనిక, మండల నాయకులు కృష్ణయ్య, ఎంపిటిసిలు వెంకట్‌నారాయణ, సర్పంచ్ చంద్రకళ, బీసన్న, తహశీల్దార్ లక్ష్మికాంత్, సిందూజ, ఏపీవో శేఖర్‌గౌడ్, సాయిలు, తదితరులు పాల్గోన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
* ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్
మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 17: మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని నేషనల్ అకాడమి ఆఫ్ కంస్ట్రషన్స్ ఆధ్వర్యంలో లేబర్ డిపార్టుమెంట్ సహకారంతో మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్ట్ఫికేట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేసి మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఆమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహిళా సంఘాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా చూడాలన్నారు. అదేవిధంగా ఫొ టోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్‌ను కళాకారులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినందుకు గాను జిల్లాలోని ఫోటోగ్రాఫర్లు, వీడియాగ్రాఫర్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అదేవిధంగా హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్‌యాత్రకు వెళ్తున్న ముస్లీం సోదరులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగకుండా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హజ్‌యాత్రికులకు వ్యాక్సిన్‌చుక్కలను వేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన నాణ్యతపై ఎమ్మెల్యే ఆగ్రహం
కోయిలకొండ, జులై 17: వింజమూరు గ్రామంలో మంగళవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డికి జిల్లాపరిషత్ పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే వి ద్యార్థులతో మాట్లాడుతూ మీకు భోజనం ఎలా ఇస్తున్నారు, నాణ్యతగా ఉం దా.. గుడ్డు ఇస్తున్నారా లేదా అని ప్రశ్నించారు..? దీంతో విద్యార్థులు తమకు మూడునెలలుగా గుడ్డు ఇవ్వడం లేదని తెలిపారు. విద్యార్థులకు మూడు మాసాలుగా ఎందుకు గుడ్డు ఇవ్వడం లేదని పాఠశాల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించని ఏజెన్సీని తొలగించాలని ఆదేశించారు.