మహబూబ్‌నగర్

తెరాసలో పదవుల పందేరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 3: టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు పదవులు పందెరం షురూ అయ్యింది. వివిధ నామినేటెడ్ పోస్టుల భర్తికి కసరత్తు మొదలైనట్లు తెలుస్తుంది. వివిధ నియోజకవర్గాలకు సంబందించిన సినియర్ నాయకులు పార్టీ అవిర్భావం నుండి గులాబీ జెండా పట్టుకుని ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న నాయకుల జాబితా రెండు దఫాలుగా సిద్దం చేసినట్లు సమాచారం. దింతో టిఆర్‌ఎస్‌లో ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. పలువురు ఆశావాహులు పదవుల కోసం లాబియింగ్ షురూ చేశారు. ఇటివల ముఖ్యమంత్రి కెసి ఆర్ కూతురు కవిత మహబూబ్‌నగర్‌కు వచ్చిన సందర్భంగా నామినెటేడ్ పోస్టుల్లో ఉద్యమకారులకు, 2001 నుండి పార్టీ కోసం పని చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేయడంతో టి ఆర్ ఎస్ నాయకుల్లో మరింత ఆశలు రెక్కెత్తించాయి. ఇది ఇలా ఉండగా టి ఆర్ ఎస్ పార్టీ జిల్లా కమిటీని కూడా పూర్తి చేసేందుకు పార్టీ అధ్యక్షుడు శివకుమార్ కసరత్తు మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేది నాటికి నామినెటేడ్ పోస్టులన్నింటిని భర్తి చేయాలని ముఖ్యమంత్రి కెసి ఆర్ రనిర్ణయం తీసుకోవడంతో జిల్లాలో ఒక్కసారిగా టి ఆర్ ఎస్‌లో రాజకీయ లాబియింగ్ జోరుగా కొసాగుతుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మహిళలకు రాజకీయాల్లో మరో అరుదైన అవకాశం లబించింది. ఏ ప్రభుత్వం కూడా గతంలో మార్కెట్ కమిటీలలో మహిళలకు అవకాశం కల్పించాలని ఆలోచించకపోవడం ఆ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డక తొలిసారిగా నూతన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ వినూత్నరితీలో మార్కెట్ కమిటీలకు కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే నిర్ణయం తీసుకోవడం దాంతో 33శాతం మహిళలకు ఈ కమిటీల్లో అవకాశం కల్పించారు. దాంతో జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ఆరు మార్కెట్ యార్డుల చైర్మన్ పీఠాలపై మహిళ మణులు కూర్కోనున్నారు. జిల్లాలో 18 మార్కెట్ యార్డులు ఉండగా జనరల్ కెటగిరిలో 11 స్థానాలు అందులో మహిళల వాటా నాలుగుకు రిజర్వేషన్లు కల్పించారు. అదేవిధంగా ఎస్సీ కెటగిరిలో మూడు రాగా, అందులో ఒకటి మహిళ రిజర్వేషన్‌కు ఖరారు అయ్యింది. బిసి కేటగిరిలో నాలుగు స్థానాలు రాగా అందులో ఒకటి మహిళలకు రిజర్వుడ్ అయ్యింది. మొత్తంగా ఆరు మార్కెట్ యార్డులను మహిళలకు రిజర్వుడ్ చేశారు. 18 మార్కెట్ పాలక వర్గాల్లో ఆరింటిని మహిళలు చేజికించుకోనున్నారు. వ్యవసాయంలో పురుషులకు చేదోడు వాదోడుగా ఉంటూ దాదాపు సమానపాత్ర పోషిస్తున్న మహిళల చేతికి స్వాతంత్య్రం వచ్చిన 60 ఏళ్ల తర్వాత ఇప్పుడు వ్యవసాయ ఆధారిత మార్కెట్ల పాలక పగ్గాలు అందుతున్నాయి. ఇప్పటికే పాలమూరు మహిళా సంఘాలు ఏటా దాన్యం కొనుగోలులో కోట్ల లావాదేవిలు నిర్వహిస్తూ పొరుగు రాష్ట్రాల మగువలకు పాఠాలు బోదిస్తున్న పాలమూరు జిల్లా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అరుదైన అవకాశం కల్పించింది. మహిళ రిజర్వేషన్లలో ప్రాధాన్యం ఉన్న మార్కెట్ యార్డులు రిజర్వు కావడం నామినెటేడ్ స్థానాలను ఆశిస్తున్న నాయకులకు శృంగభంగం కలిగింది. బాదేపల్లి, గద్వాల, షాద్‌నగర్, కొత్తకోట, మార్కెట్లకు మంచిపేరు ఉంది. పరపత్తి ఆధాయం కూడా ఇక్కడ ఆశించిన స్థాయికన్నా ఇక్కడ రేట్టింపు ఉంటుంది. రిజర్వేషన్లు ప్రకటించిన ప్రభుత్వం ఇక నియమాకాలే ఆలస్యం అన్నట్లుగా ఉంది. మహిళా రిజర్వేషన్లు రావడంతో తెరాసలో కొందరు నాయకులు తమ కుటుంబాల్లోని మహిళలకు పదవులను దక్కించుకునేందుకు అప్పుడే ఎవరి స్థాయిలో వారు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే జిల్లాలో నామినెటేడ్ పోస్టుల అడుగుపడింది. దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్‌గా జట్టి నరసింహరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం గత 30వ తేదిన ప్రమాణ స్వీకారోత్సవం కూడా మంత్రి హరీష్‌రావు సమక్షంలో నిర్వహించడం చకచ్కగా సాగిపోయింది. ఏట్టి పరిస్థితుల్లో ఈ నెలఖారు వరకు అన్ని మార్కెట్ కమిటీలతో పాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నామినెటేడ్ పోస్టులు భర్తి కానున్నాయి. వివిధ నియోజకవర్గాలకు సంబందించిన మంత్రులు, ఎమ్మెల్యేలతో టిఆర్‌ఎస్ నాయకులు లాబియింగ్‌లు మొదలుపెట్టారు. నాయకుల మేప్పు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. నామినెటేడ్ పోస్టుల భర్తిలో అవకాశం పొందేందుకు జిల్లాలోని పలువురు ప్రముఖులు కూడా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.