మహబూబ్‌నగర్

వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవాబుపేట, మే 5: మండుతున్న ఎండలు కారణంగా వడ దెబ్బను తాళలేక జనం విలవిలలాడుతున్నారు. పశుపక్ష్యాదులు అల్లాడుతున్నాయి. భానుడి ప్రతాపానికి బక్కచిక్కిన ప్రాణాలు బలైపోతున్నాయి. ఇలాంటి సంఘటనే గురువారం మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. వడదెబ్బకు తాళలేక తన సొంత కుమారుడు మృత్యువాత పడటాన్ని జీర్ణించుకోలేక తండ్రి సైతం మృత్యువాత పడ్డాడు. ఒకే రోజు ఒకే ఇంట్లో తండ్రి,కొడుకులిద్దరు మృత్యువాత పడటంతో ఆకుటుంబం శోకతప్త హృదయాలతో ద్రవించి పోయింది. కొల్లూరు గ్రామానికి చెందిన లంబ చెన్నయ్య (45) గురువారం తెల్లవారు జామున మృత్యువాత పడ్డాడు. ఆయన మృతి వార్త విని తట్టుకోలేక తండ్రి చిన్నయ్య (85)గుండె ఆగి గురువారం మధ్యాహ్నాం మృతి చెందాడు. ఒకే రోజు తండ్రి కొడుకులిద్దరు తనువు చాలించడంతో గ్రామం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుడు చెన్నయ్యకు ఒక కుమార్తె,ఇద్దరు కుమారులు,్భర్య ఉండగా చిన్నయ్యకు ఆరు మంది కుమారులు,ముగ్గురు కుమార్తెలు ఉండగా వడదెబ్బకు తాళలేక మృతి చెందిన చెన్నయ్య చిన్నయ్య కుమారుల్లో నాల్గవ వాడు. తండ్రి కొడుకుల మృతి సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే తహాశీల్‌దార్ చెన్నకిష్టప్ప,మండల వైద్యఅధికారి జావీద్,ఎస్సై విజయ్ కుమార్‌లు ఘటన స్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబీకులను పరామర్శించారు.