మహబూబ్‌నగర్

వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు.. ఇబ్బందులు లేకుండా చూస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకద్ర, ఆగస్టు 13: వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తానని దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొబ్బలి అంజనేయులు అన్నారు. సోమవారం దేవరకద్ర వ్యవసాయమార్కెట్ యార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీ ఆర్ రిజర్వేషన్ల ద్వారా తనకు దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్‌గా అవకాశం ఇవ్వడం పట్ల తాను రుణపడి ఉంటానని తెలిపారు. పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవం విజయవంతం చేసిన అందరికి తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని వెల్లడించారు. మండలంలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కృషి చేయడం జరుగుతుందని, నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాల మండలాలకు సంబంధించిన రైతులు కూడా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్‌కు దాన్యం తీసుకువస్తుంటారని అందరికి మార్కెట్‌యార్డులో వౌళిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే వ్యవసాయ మార్కెట్‌యార్డులో రైతులకు కావల్సిన సౌకర్యాలు ఉన్నాయని మరిన్ని సౌకర్యాలు కల్పించి రైతులకు అండగా నిలుస్తామన్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రొత్సహం మరవలేనిదని ఆయన తనపై నమ్మకం ఉంచి ఇలాంటి పదవిని అప్పజెప్పడం పట్ల ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. భాద్యతగా పనిచేసి దేవరకద్ర మార్కెట్‌యార్డుకు మంచిపేరు తీసుకురావడానికి శయశక్తుల కృషి చేస్తానన్నారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారంగానే మార్కెట్‌యార్డులో దాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని దళారుల ప్రమేయం లేకుండా న్యాయబద్దంగా రైతులకు గిట్టుబాటుధర కల్పిస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అందులో బాగంగానే మిషన్‌కాకతీయ, రైతులకు పెట్టుబడి సహయం, సకాలంలో ఎరువులు అందించడం నిరంతర విద్యుత్, రైతుధీమా కోసం భీమా పథకం లాంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుందన్నారు. కోయిల్‌సాగర్ కుడికాలువకు రూ.23కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించిందని దింతో మండలంలో దాదాపు 11గ్రామాలకు తాగు,సాగునీటి కష్టాలు తిరనున్నాయని తెలిపారు. వ్యవసాయ మార్కెట్‌యార్డులో తూకాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటామని రైతులను ఎవరు మోసం చేసిన సహించేది లేదని హెచ్చరించారు.