మహబూబ్‌నగర్

విశ్వహిందూ పరిషత్ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 13: స్వామి పరిపూర్ణనందపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలంటూ డిమాండ్ చేస్తూ సోమవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్‌లో సైతం విహెచ్‌పి, భజ్‌రంగ్‌దళ్, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, పలు బ్రహ్మాణ సంఘాల నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడికి తరలివచ్చారు. పాలమూరు పట్టణంలో ముందుగా భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. టీటీడీ కళ్యాణ మంటపం దగ్గర గల ధర్నా చౌక్ నుండి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. ర్యాలీగా వస్తున్న నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అయితే కొందరు భజ్‌రంగ్‌దళ్ కార్యకర్తలు పోలీసుల కళ్లు గప్పి కలెక్టరేట్ వెనక నుండి వెళ్లి ఒక్కసారిగా కాషాయజెండాలను చేత పట్టుకుని కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లారు. దాంతో పోలీసులకు అప్రమత్తమై కలెక్టరేట్ వైపు పరుగులు తీశారు. అప్పటికే భజ్‌రంగ్‌దళ్ కార్యకర్తలు కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన ద్వారం ముందు బైటాయించి ఆందోళన చేస్తున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేయడానికి నానా ఇబ్బందులు పడ్డారు. పోలీసులకు, భజ్‌రంగ్‌దళ్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వీవాదం తోపులాట వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దాదాపు 60 మందికి పైగా యువకులు కలెక్టరేట్‌లోకి దూసుకొచ్చి హల్‌చల్ సృష్టిస్తూ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్వామి పరిపూర్ణనందపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలంటూ ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అరెస్ట చేయడానికి వ్యయ ప్రయసాలు పడాల్సి వచ్చింది. అరెస్టు చెయడానికి ప్రయత్నిస్తే భజ్గ్‌ద్రళ్ కార్యకర్తలు కొందరు పరుగులు తీస్తూ కలెక్టరేట్ ప్రాంగాణంలో పోలీసులకు దొరకకుండానే ఉరుకులు పరుగులు పెట్టారు. చివరకు కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన ద్వారం ముందు బైటాయించి ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ భాస్కర్ స్పెషల్ పార్టీ పోలీసులను రప్పించి దర్నా చేస్తున్న వారిని ఈడ్చుకెళ్తూ పోలీస్ వాహనాల్లో ఎక్కించారు. కొందరు యువకులు అరెస్టు చేస్తున్న సమయంలో పోలీసులు ఈడ్చు కెళ్తున్న తీరును తీవ్రంగా ప్రతిఘటిస్తూ పోలీసులపైకి ఎదరుతిరిగారు. శాంతియుతంగా అరెస్టు చేస్తామని కలెక్టరేట్‌లోకి అనుమతి లేకుండా ఎలా వచ్చారంటూ డీఎస్పీ భాస్కర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లోకి దూసుకువచ్చిన వారిని అరెస్టు చేసి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరిలించారు. కాగా ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తున్న నాయకులను సైతం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విహెచ్‌పి జిల్లా అధ్యక్షుడు మద్దియాదిరెడ్డి మాట్లాడుతూ స్వామి పరిపూర్ణనందపై రాష్ట్ర ప్రభుత్వం విదించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇక మంత్రులను, ఎమ్మెల్యేలను అడ్డుకునే విధంగా తమ కార్యాచరణ ఉండబోతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కార్యవాహ వెంకటేశం, బీజేపీ రాష్ట్ర నాయకులు పడాకుల బాల్‌రాజ్, రతంగ్‌పాండురెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చ ఉపాధ్యక్షురాలు అంజమ్మ, జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతకు అండ
-ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి
మక్తల్, ఆగస్టు 13: తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతకు అన్ని విదాల అండగా తమ ప్రభుత్వం ఉంటుందని, రైతుబంధు పథకం రైతన్నకు ఓ వరం లాంటిదని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం మక్తల్ మున్సిపాలిటి కార్యాలయంతోపాటు సంగంబండ గ్రామంలో ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి రైతుబంధు పథకానికి సంబందించిన బీమా బాండ్లను పంపిణి చేశారు. అనంతరం ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతుల ప్రతి అవసరాన్ని గుర్తించిన తమ ముఖ్యమంత్రి కెసిఆర్ వారికి అండగా నిలుస్తూ అనేక పథకాలతో ఆధుకుంటుండటాన్ని చూసి ప్రతి పక్షాలు ఓర్వలేక పోతున్నాయని అన్నారు. ఏరైతు ఇతరుల ముందు చేయిచాచి అడుక్కోవద్దన ఆలోచన విదానంతో తమ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఇలాంటి పథకాలు భారతదేశంలోని ఏరాష్ట్రంలో లేవని అన్నారు.
రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం
నర్వ: రాష్ట్రంలో రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం నర్వ, లంకాల గ్రామంలో రైతుబీమా బాండ్లను ఎమ్మెల్యే పంపిణి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు రైతుబందు పథకంతో పాటు రూ.5లక్షల బీమా సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. రైతులు గిట్టుబాటు ధర, పెట్టుబడి, ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసి ఆర్ కల్పించి రైతు బాందవుడుగా రైతుల్లో చెరగని ముద్రగా ఏర్పడ్డరన్నారు.