మహబూబ్‌నగర్

మళ్లీ టీఆర్‌ఎస్‌దే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 14: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన మళ్లీ టీఆర్‌ఎస్ పార్టీయే అధికారంలోకి రావడం ఖాయమని మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ భాద్యతలు చేపట్టడం తధ్యమని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం హన్వాడ మండల పరిధిలోని కొత్తపేట, హన్వాడ, పెద్దర్పల్లి గ్రామాల్లో రైతుభీమా బాండ్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హన్వాడ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పెద్దపీఠ వేసిందని తెలిపారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే రైతుబంధు పథకం, రైతుబీమా పథకాలను ఆమలుల్లోకి తెచ్చి అందరి దృష్టిని మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వైపు మళ్లీంచారన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక్కడి పథకాలపై ఆరా తీస్తుండగా మరోపథకం కేసీఆర్ ప్రారంభించడం రైతుల అదృష్టమన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని రైతులే కాపాడుకోవాలని ప్రతి ఒక్కరు టీఆర్‌ఎస్ పార్టీకి అండగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో మరోసారి మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మ, తహశీల్దార్ జ్యోతి, ఎంపీడిఓ నటరాజ్, డిఎస్‌డిఓ సత్యవాణి, నాయకులు లక్ష్మయ్య, కృష్ణయ్య, బాలయ్య, దస్తయ్య పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్ సబ్‌జైలు సందర్శించిన ఐహెచ్‌ఆర్సీ సభ్యులు
నాగర్‌కర్నూల్, ఆగస్టు 14: అంతర్జాతీయ మానవ హక్కుల సమితి సభ్యులు మంగళవారం స్థానిక సబ్‌జైలును సందర్శించి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖైదీలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు అవుట శ్రీనివాసులు మాట్లాడారు. సబ్‌జైలులో ఉన్న నల్లవెల్లి గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తికి ఒక కేసులో 2017, ఆగస్టు 10న కోర్టు సంవత్సరం శిక్ష, జరిమానా విధించగా, ఈనెల 9న రమేష్ శిక్ష కాలం పూర్తయిన జరిమానా కట్టకపోవడంతో అప్పటి నుంచి జైలులో ఉన్నాడనే విషయాన్ని తెలుసుకున్న ఐహెచ్‌ఆర్సీ జిల్లా అధ్యక్షులు అవుట శ్రీనివాసులు అట్టి జరిమానాను కట్టగా సబ్ జైలర్ స్పందించి రమేష్‌ను జైలును విడుదల చేసినట్లు శ్రీనివాసులు నేడొక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అవుట శ్రీనివాసులు, శ్రీ్ధర్, సాయిక్రిష్ణ, శ్రీను, జీవన్‌కుమార్, సరిత, మాలిక్ పాల్గొన్నారు.
కేఎల్‌ఐ కాలువకు గండి
సాన్‌గల్, ఆగస్టు 14: మండల పరిదిలోని కేతేపల్లి, బుసిరెడ్డిపల్లి గ్రామాల మద్య కె ఎల్ ఐ కాలువ నీటి ప్రవాహానికి తెగిపోయింది. బొల్లిగట్టు వద్ద భీమా కాలువ పైభాగంలో కె ఎల్ ఐ కాలువ బ్రిడ్జిని నిర్మించగా బ్రిడ్జి దాటిన వెంటనే కె ఎల్ ఐ కాలువ తెగి పోయి సాగునీరు భీమా కాలువలోకి ప్రవహించింది విషయం తెలుసుకున్న ఎంపిపి వెంకటేష్‌నాయుడు, జడ్పిటిసి రవి, టి ఆర్ ఎస్ నాయకులు గోవర్దన్ సాగర్, తిరుపతయ్య సాగర్‌లు తెగిపోయిన కాలువ దగ్గరకు చేరుకుని అధికారులతో మాట్లాడారు. వెంటనే నీటి ప్రవాహాన్ని తగ్గించి మరమ్మత్తులు చేపట్టి సాగునీటిని విడుదల చేయాలని అదికారులను ఆదేశించారు.