మహబూబ్‌నగర్

ధర్మరక్షణకు అందరూ పాటుపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 14: ధర్మరక్షణకు అందరూ పాటుపడాలని పరమేశ్వరుడి నిత్యపూజ ఎంతో శక్తినిస్తుందని కాశీజ్ఞాన సింహాసనాధీశ్వర శ్రీ 1008 జగద్గురు చంద్రశేఖర శివాచార్యులు అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణమండపంలో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో చేపట్టిన ఇష్టలింగ సామూహిక పూజ అత్యంత వైభవంగా, ఎంతో భక్తిశ్రద్ధలతో జగద్గురు చంద్రశేఖర శివాచార్యులు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన లింగాయత్, వీరశైవ సమాజం భక్తులతో పాటు వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఇష్టలింగపూజ విశిష్టత గురించి జగద్గురు తెలిపారు. ఇష్టలింగ పూజ అనంతరం జగద్గురు చంద్రశేఖర శివాచార్యులు మాట్లాడుతూ ధర్మాన్ని కాపాడడం అందరి బాధ్యత అని అది మానవ మనుగడను కాపాడుతుందని భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవన్నారు. దేశంలో హిందూ సనాతన ధర్మంలో వివిధ వర్గాల వారు ధర్మాన్ని కాపాడుతున్నారని అందులో భాగంగా పవిత్ర శ్రావణమాసం అత్యంత పవిత్రమైందన్నారు. ఈ మాసంలో పూజలు చేసినట్లు అయితే ఎంతో శక్తి వస్తుందని ఐశ్వర్యాలు సిద్ధించనున్నాయన్నారు. వీరశైవ కులస్థులు శివధ్యానం విశిష్టత గురించి ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇష్టలింగ పూజ ఎంతో పవిత్రమైందని ఈ పూజలో పాల్గొన్న కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ తమ పిల్లలకు కూడా ధర్మం గురించి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాశ్చాత్య సంస్కృతికి దూరంగా ఉంటే కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని అమ్మనాన్నలు వృద్ధులు అయ్యాక పిల్లలు తమ తల్లిదండ్రులను తామే చూసుకోవాలనే బాధ్యత సంప్రదాయంలో ఉందన్నారు. అందుకే సంప్రదాయాలను పిల్లలకు చిన్నప్పటి నుండే నేర్పించాలని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సైతం ఇష్టలింగ పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారితో తీర్థప్రసాదాలు స్వీకరించారు. వీరశైవ సమాజంకు సంబంధించిన పుస్తకాన్ని స్వామిజీతో పాటు ఎమ్మెల్యే అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున స్వామి, శ్రీశైలం, గాంధీ, రవికుమార్, సిద్దిరామయ్య, రాజలింగం, నాగభూషణ్ పాల్గొన్నారు.