మహబూబ్‌నగర్

మిన్నంటిన సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 14: స్వామి పరిపూర్ణనందపై ఆంక్షలను ఎత్తివేయాలని హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్, బీజేపీ, హిందూధార్మిక సంస్థల ప్రతినిధులు సంబురాలు జరుపుకున్నారు. పాలమూరు జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మద్దియాదిరెడ్డి మాట్లాడుతూ పరిపూర్ణనందస్వామికి తెలుగురాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఊరటనిచ్చిందని, ఆయనపై విధించిన హైదరాబాద్ నగర బహిష్కరణను ఎత్తివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తాము తీవ్ర సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ఈ తీర్పు చెంపపెట్టులాంటిదని ఆరోపించారు. హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరాముడిపై కత్తిమహేష్ వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ పరిపూర్ణనందస్వామి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారన్నారు. అయితే పాదయాత్రను అడ్డుకోవడమే కాకుండా గృహనిర్బంధంచేసి, ఏకంగా స్వామిజీని హైదరాబాద్ నగర బహిష్కరణ చేయడం దుర్మర్గమైన చర్య అన్నారు. కోర్టులో న్యాయం గెలిచిందని ఇప్పటికైన సాధుసంతులపై ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకూడదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ నేతలు లక్ష్మారెడ్డి, లక్ష్మీనారాయణ, హన్మంతు, నరేంద్ర, బీజేపీ రాష్ట్ర నాయకులు పడాకుల బాలరాజు, అంజమ్మ పాల్గొన్నారు.

నేడు కంటి వెలుగుకు శ్రీకారం
*మంత్రి లక్ష్మారెడ్డి
జడ్చర్ల, ఆగస్టు14: రాష్ట్రంలోని ప్రజలందరికీ కళ్లకు సంబంధించిన సమస్యలను పూర్తిగా నివారించడం కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తోందని మంత్రి లక్ష్మారెడ్డి మంగళవారం జడ్చర్లలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రాన్ని పరిపాలించిన ఏముఖ్యమంత్రికి కూడా ఇలాంటి ఆలోచన రాలేదని సీఎం కేసీఆర్‌కు ఈ ఆలోచన రావడం ఎంతో శుభదాయకమని ఆయన వాఖ్యానించారు. కంటివెలుగు కార్యక్రమ అమలులో భాగంగా రాష్ట్రంలో 812 బృందాలు పనిచేస్తాయని మంత్రి వెల్లడించారు. ఒక్కోటీం రోజూకు 250మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన కళ్లఅద్దాలను అందించడం జరుగుతుందని, ఆపరేషన్లు అవసరం ఉన్న వారికి ఆపరేషన్‌లు చేయించడం జరుగుతుందని అన్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులందరూ అధికారాన్ని ఎంజాయ్ చేశారని,ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్రజాసేవే పరమావధిగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారని ఆయన అన్నారు. ఈసమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్,నాయకులు రాములు,టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కోడ్గల్ యాదయ్య, శ్రీకాంత్ పాల్గొన్నారు.