మహబూబ్‌నగర్

మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, ఆగస్టు 16: రాష్టంలో పట్టణాలు సర్వతోముఖాభివృద్ది సాధించాలంటే ప్రజల భాగస్వామం అవసరమని రాష్ట్ర మున్సిపాలిటీ కమిషనర్ టీకే శ్రీదేవి అన్నారు. గురువారం పట్టణంలోని స్మృతివనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతు పార్టీలకు అతీతంగా ప్రజ లు అభివృద్ధికి సహకరించాలని కోరారు. అంతకు ముందు ఆర్‌అండ్‌బి అతిథి గృహములో ఆర్డీఓ అమరేందర్ ఆధ్వర్యంలో తహశీల్దార్లు స్వాగతం పలికారు. అంబేద్కర్‌చౌర స్తాలో గల సులబ్ కాంప్లెక్స్‌ను ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి ఆమె లాంఛనంగా ప్రారంభించారు. సాయినగర్ కాలనీలో కౌన్సిలర్ సుంకరి నిర్మల ఆధ్వర్యంలో మెట్మా పరిధిలోగల మహిళ సంఘాల సభ్యులతో కలిసి హరిత హారం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. వేంకటేశ్వర కాలనీలో కౌన్సిలర్ బీమరాణీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. విలీన గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి వుందని ఉపాధి హామీ పథకం కేంద్రం నిలిపివేస్తే దానికి సమాంతరంగా ఉపాధి కల్పిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో చైర్మెన్ తులసిరాం, వైస్ చెర్మెన్ బందం విశే్వశ్వర్‌నాథ్, జిల్లా రైతు సమన్వయ సమతి కో ఆర్డినేటర్ పోకల మనోహర్ , కమిషనర్ వెంకటస్వామి, జయంత్‌కుమార్ రెడ్డి, టీ ఆర్ ఎస్ నాయకులు , కౌన్సిలర్లు మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.