మహబూబ్‌నగర్

ఉద్యోగులను మోసగిస్తున్న సీఎం కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 16: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులను మోసం చేశారని మాయమాటలు చెప్పి ఇంక ఎంతకాలం మోసం చేయలేరని తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం మహబూబ్‌నగర్‌లోని టీజేఏస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ. ఐఆర్‌లను విషయంలో కేసీఆర్ భ్రమలో పెట్టారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 2న ఐఆర్ ప్రకటిస్తానని ఆగస్టు 15న పీఆర్‌సీ ఫిట్‌మంట్ ప్రకటిస్తానని హామీ ఇచ్చి తీరా వాటి విషయానే్న మరిచిపోయారని అన్నారు. కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు చేసింది ఏమిలేదని అన్నారు. హెల్త్‌కార్డులు పనికి రాకుండా పోతున్నాయని రాష్ట్రంలో కొంతమందికి ఇచ్చిన అవి ఉపయోగకరంగా లేదని ఆరోపించారు. హెల్త్‌కార్డులు ఐడీ కార్డులకు సైతం పనిరాకుండపోయాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు హెల్త్ విషయంలో ఆసుపత్రిలో ఖర్చు పెట్టిన వాటిలో 10శాతం కూడా రీయింబర్స్‌మెంట్ రావడంలేదని ప్రభుత్వం ఉద్యోగుల పట్ల వివక్షత చూపుతుందని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేసీఆర్ పని చేస్తున్నారని ఇక రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రజలను ఎలా మోసం చేయాలని ఎలా మభ్యపెట్టాలని టీఆర్‌ఎస్ నాయకులు చూస్తున్నారని మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని ఆయన హెచ్చరించారు. 2014 ఎన్నికల్లో ఉద్యోగులు, పెన్షనర్లు కేసీఆర్‌ను తలపైకి ఎత్తుకుని టీఆర్‌ఎస్ అంటే తమ పార్టీ అనేవిధంగా పని చేశారని కానీ ఆ పరిస్థితులన్ని తారుమారైపోయావని అన్నారు. జిల్లాలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఓటమి భయంతో ఉన్నారని అది కూడా నిజం కాబోతుందని తెలిపారు. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని ఉత్తర తెలంగాణలో ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న కేసీఆర్ ఇక్కడి ప్రాజెక్టులను ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు.