మహబూబ్‌నగర్

బీజేవైఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 16: మాజీ ప్రధానమంత్రి అటల్‌బిహారి వాజపేయ మృతి చెందడంతో గురువారం జిల్లా వ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ నివాళ్లు అర్పించారు. జిల్లా కేంద్రంలోని మహబూబ్‌నగర్ పట్టణంలో తెలంగాణ చౌరస్తా నుండి అంభేద్కర్ చౌరస్తా వరకు కొవ్వత్తులతో బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ చౌరస్తాలో వాజపేయ మృతి పట్ల సంతాపాన్ని తెలియజేసి ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి మాట్లాడుతూ అటల్ బిహారి వాజపేయ మృతి దేశానికి తీరనిలోటు అని ఆయన దేశ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఆశయ సాధనకోసం నిరంతరంగా కృషి చేస్తూ ఆయన ఆత్మకుశాంతి చేకూరేలా పని చేయడం జరుగుతుందని అన్నారు. వాజపేయకి జిల్లాతో ఉన్న అనుబంధం మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పడాకుల రామచంద్రయ్య, కృష్ణవర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు

దేశం గొప్ప నేతను కోల్పోయింది
* భారత రాజకీయ రంగానికి తీరని లోటు * బీజేపీ పార్టీ నాయకులు

గద్వాల, ఆగస్టు 16: భారతీయ జనతా పార్టీ కురవృద్దుడు, భారతరత్న అటల్‌బిహారీ వాజపేయ మృతి పట్ల జోగుళాంబ గద్వాల జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో కొవ్వతుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాతబస్టాండులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వాజపేయ మరణంతో దేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందన్నారు. బీజేపీ పార్టీ ఒక గొప్ప నాయకుని కోల్పోంయిందని, ప్రతి నిమిషం దేశం కోసం పని చేశారని తెలిపారు. అటల్ దశాబ్దాలుగా దేశం కోసం జీవించారని, అత్యంత శ్రద్ధాసక్తులతో దేశానికి సేవ చేశారని పేర్కొన్నారు. విభేదించే రాజకీయ పార్టీ వారికి కూడా అమోదయోగ్యుడిగా, రాజకీయ విలువలూ మర్యాదల పరంగా శిఖర సమానుడిగా , పార్లమెంటరీ సంప్రదాయాల పరంగా మహోన్నతుడిగా వాజ్‌పేయి అందరి మన్ననలు పొందారని తెలిపారు. భారత దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టారని, వాజపేయ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు చిలువేరి జగన్నాథం, రాజశేఖర్ రెడ్డి, వెంకటాద్రిరెడ్డి, రవికుమార్ ఎక్బోటే, అప్సర్‌పాష, జనార్దన్, పసుపుల శ్రీనివాసులు, దిలీప్‌కుమార్ దేశాయ్, సాయిగోవర్దన్, గోసాయి హరి, డాక్టర్ విజయ్, మహేష్‌నాయుడు, జమీర్, మోహన్‌రెడ్డి,కుమారస్వామి, విజయ్, పాండు పాల్గొన్నారు.