మహబూబ్‌నగర్

వాజపేయకి ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 17: భారతదేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారి వాజపేయకి జిల్లా ప్రజలు ఘన నివాళులు అర్పించారు. శుక్రవారం జిల్లాలో గ్రామ గ్రామాన వాజపేయ చిత్రపటాలను ఉంచి పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలిజేసి నివాళులు అర్పించారు. వాజపేయ మృతికి సంతాపంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. దాంతో జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలు బంద్ అయ్యాయి. జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పాఠశాలల విద్యార్థులు సైతం తమ గ్రామాలలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్ని వాజపేయ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో వాజపేయ లాంటి మహోన్నతమైన నేతకు ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప గౌరవం ఇచ్చినట్లుగా టీఆర్‌ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సంతాపసభలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, రాష్ట్ర నాయకులు కొండయ్య, జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డిలతో పాటు జిల్లాకు చెందిన వివిధ నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు. వాజ్‌పేయి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. సంతాప సభలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ మాట్లాడుతూ అటల్ బిహారి వాజపేయ భరతమాత ముద్దుబిడ్డ అని అన్నారు. ఇలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం దేశ ప్రజలకు తీరని లోటు అని అన్నారు. బీజేపీ నేతలు ఆయన ఆశయాలను మరింత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని అన్నారు. భారతదేశంలో ఎందరో నేతలకు వాజ్‌పేయి మార్గదర్శకులని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావునామాజీ మాట్లాడుతూ వాజ్‌పేయితో తనకు మంచి పరిచయాలు ఉండేవని తాను యువమోర్జ జాతీయ నాయకుడిగా పని చేసిన సందర్భంలో తనతో చాలా విషయాలు చెప్పేవారని తెలిపారు. ఓ సందర్భంగా నారాయణపేట మహిళకు రక్తం అవసరం ఉందని చెబితే తానే రక్తం ఇస్తానని ముందుకు వచ్చిన వాజపేయని ఎంత పొగిడినా తక్కువేనని అన్నారు. ఆయన జీవితం దేశానికి అంకితం చేశారని అన్నారు. ఇలాంటి నాయకులు దేశానికి అవసరమని భావితరాలకు మంచి నాయకత్వ లక్షణాలు ఉండాలని వాజ్‌పేయి చరిత్రను దేశంలోని అన్ని భాషల్లో పాఠశాలలో పుస్తకాలు ముద్రించాలని తెలిపారు. హన్వాడ, గండ్వీడ్, నవాబ్‌పేట, భూత్పూర్, అడ్డాకుల, మహబూబ్‌నగర్ పట్టణంలోని వివిధ వార్డుల్లో వాజపేయి చిత్ర పటాలకు పూలమాలలు వేసి పార్టీలకు అతీతంగా ఘన నివాళులు అర్పించారు. ఢిల్లీలో జరిగిన అంత్యక్రియల్లో ఎంపీ జితేందర్‌రెడ్డితో పాటు జిల్లాకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. కాగా వాజ్‌పేయి అంత్యక్రియలను జిల్లా ప్రజలు తమ ఇళ్లల్లోని టీవీల ముందు కూర్చుని మహానేత అంత్యక్రియలను వీక్షించారు. ఏడు రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం సంతాప సభలు జరుపుకోవాలని ప్రకటించడంతో వాడవాడలో వాజపేయ సంతాప సభలు జరిగాయ. దాంతో అన్ని రాజకీయ పార్టీలు సిద్ధాంతాలను పక్కన పెట్టి సంతాప సభల్లో పాల్గొన్నారు. జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాలను అవనతం చేశారు.