మహబూబ్‌నగర్

అంధత్వ నిర్మూలనే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, ఆగస్టు20: అందత్వ నిర్మూలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని నాటవెల్లి గ్రామంలో కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నీళ్లు, నిధులు,నియామకాలకు కృషి చేసిందని, రైతుబందు పథకంతో నియోజక వర్గంలో ప్రతి రైతుకు తోడ్పాటును అందించిందన్నారు. రైతు జీవిత బీమా పథకంతో రైతులకు భరోసానిచ్చిందని ఇటివలే పాలెం గ్రామంలో రైతు మృతిచెందితే మొదటి రోజున ఆ కుటుంబానికి నామినికి రూ. 5లక్షలు జమా చేశామన్నారు. రైతుకు కావాల్సింది 24గంటల విద్యుత్తు, పంట పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకులు కుట్ర పన్నుతూ రైతులను రెచ్చగొడుతున్నారని , కోర్టులో కేసులు వేస్తూ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని మొసలి కన్నీరు కారుస్తూ పాదయాత్ర చేయడంతో సిగ్గుచేటన్నారు. నాల్గేండ్లలో రాష్ట్రంలో ఎంతో ప్రగతి సాధించిందని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ద్వారా మంచినీటిని అందిస్తామని అన్నారు. నియోజక వర్గంలో అన్ని గ్రామాలకు బీటి రోడ్లను వేశామని అన్నారు. అంతుకు ముందు నాటవెల్లి పెద్ద తాండలో 17లక్షల లీటర్ల సామార్థ్యం గల మంచినీటి ట్యాంకుకు ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుంతవౌనిక, మార్కెట్ చైర్మన్ రాజేశ్వరమ్మ, నాయకులు చెన్నకేశవరెడ్డి,నగేష్, బీంరెడ్డి, ప్రశాంత్, సురేందర్‌నాథ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నిర్మల, కటిక శ్రీను, నబీ, నారమ్మ, నాగన్నసాగర్, తదితరులు పాల్గొన్నారు.

విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి
-విద్యార్థులకు సూచించిన ఎమ్మెల్యే గువ్వల
వంగూరు, ఆగస్టు 20: విద్యార్థులు విద్యతో పాటు క్రీడలలో రాణించాలని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆయన సోమవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఆటలపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు ఆటలతో శారీరక దారుడ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆటలతో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని విద్యార్థులను కోరారు. క్రీడలతో పాటు ఉన్నతమైన చదువులు చదివి భవిష్యత్‌లో రాణించాలని కోరారు. దీనితో పాటు మండల కేంద్రంలో శ్రీ గెల్వలాంబ మాత జాతర ఉత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో రైతులకు రైతు బీమా బాండ్లను పంపిణీ చేశారు. దీనితో పాటు హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో గ్రామస్థులతో కలిసి మొక్కలను నాటారు.

ఆకలితో విద్యార్థులు విలవిల
-పట్టించుకోని అధికారులు
ఆత్మకూరు, ఆగస్టు 20: ఆత్మకూరు మండలంలోని బాలకిష్టాపూర్ గ్రామ సమీపంలో గల కస్తూరిబా పాఠశాల విద్యార్థులు మూడురోజులుగా సమయానికి బోజనం అందక ఆకలితో అలమటిస్తున్నప్పటికీ అధికారులు స్పందించడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. గత మూడు రోజులుగా సమయానికి బోజనం పెట్టకపోవడంతో సోమవారం మద్యాహ్నం విద్యార్థులు బయటకు చెపంపడంతో విషయం పొక్కింది. సమయానికి బోజనం పెట్టకపోవడంతో ఇప్పటికే కొందరు విద్యార్థులు పాఠశాల నుండి స్వంత గ్రామాలకు వెళ్లారని, సోమవారం మద్యాహ్నం వరకు బోజన వడ్డించకపోవడంతో విధిలేని పరిస్థితిలో బయటకు చెప్పినట్లు విద్యార్థులు తెలిపారు. ఈ విషయంపై పాఠశాలలో ఉన్న ఎఎస్‌ఓ శివలీలను వివరణ కోరగా గడిచిన 15 రోజులుగా తమకు సరుకులు అందడంలేదని, అయినప్పటికీ వివిద కిరాణ షాపులవద్ద సరుకులు తెచ్చి విద్యార్థులకు బోజనం పెడుతున్నామన్నారు. సోమవారం వంటలు చేసేందుకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులకు బోజనం వండించలేదని తెలిపారు. మూడు గంటల తరువాత గ్యాస్ సిలిండర్లు తెచ్చి బోజన ఏర్పాట్లు చేశారు. డిఇఓ సుశీదర్ రావుకు విషయం తలుపడంతో ఏఎస్‌ఓపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరోమారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండ చర్యలు తీసుకుంటామన్నారు.