మహబూబ్‌నగర్

మత్స్యకారులకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, ఆగస్టు 20: ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలోని తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని, ఈఏడాది రాష్ట్రం మొత్తంలో 75.8 కోట్ల చేప పిల్లలు, 4కోట్ల రొయ్య పిల్లలను రిజర్వాయర్, చెరువులు, కుంటల్లో వదులుటకు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించినట్లు ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం మక్తల్ పట్టణంలోని పెద్ద చెరువులో 1.30 లక్షలు, తిరుమలయ్య చెరువులో 30వేలు, కర్ని చెరువులో 1.20 లక్షలు, ఖానాపూర్ చెరువులో 1.20 లక్షలు మొత్తం 3.90 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఎగువ కర్నాటక, మహారాష్టల్రో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదిపై నిర్మించిన జూరాల ప్రాజెక్టుకు నీరు వచ్చి చేరుతున్న కారణంగా మక్తల్ మండలంలోని చిన్నగోప్లాపూర్ సమీపంలోని స్టేజ్-1, మక్తల్ సమీపంలోని స్టేజ్-2 ద్వారా నీటిని విడుదల చేసి ఇటు సంగంబండ, అటు భూత్పూర్ రిజర్వాయర్లను నింపుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా మక్తల్ పెద్ద చెరువును సంబండ రిజర్వాయర్‌కు వచ్చిచేరుతున్న సమాంతర కాలువద్వారా నింపడం జరిగిందని, నిండిన చెరువులు, కుంటలల్లో మత్స్యకారులు చేప పిల్లలను వదులుకొని వారి జీవనోపాదిని చూసుకునే విదంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చిట్టెం తెలిపారు. మత్స్యకారులకు 100 శాతం సబ్సిడితో ఉచితంగా చేపపిల్లలను అందించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌దేనని అన్నారు. గత ప్రభుత్వాలు మత్స్యకారులను ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. ప్రతి గ్రామంలో నీటి కుంటలు, చెరువులు ఉన్న చోట మత్స్య కారులకు ఉచిత చేపపిల్లలను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈసంవత్సరం నుండి మత్స్యకారులు తమ వ్యాపారాన్ని సులువుగా చేసుకొని ఆర్థికంగా లాభపడే విదంగా వారికి మోపేడు, బొలేరో, టాటా వాహనాలను సబ్సిడిపై ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అలాగే వలలు, తెప్పెలు, ఐస్ డబ్బాలను సైతం సబ్సిడిపై ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మత్స్యరంగం అభివృద్ధికై ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రతి మత్స్యకారుడు సద్వినియోగం చేసుకొని ఎదగాలని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మక్తల్ మత్స్య సంఘం అధ్యక్షులు కోళ్ల వెంకటేష్, మత్స్య శాఖ అధికారి లక్ష్మప్ప, ప్రాజెక్టు ఈఈ విజయనందన్, మత్స్య సంఘం సభ్యులు చంద్రశేఖర్, నర్సిములు, కావలి శ్రీహరి, డబ్బ తిప్పన్న, హన్మంతు, కిష్టప్ప, నాయకులు నర్సింహరెడ్డి, మధు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

పేట అసెంబ్లీని ఎస్సీ, బీసీలకు కేటాయించాలి
-మాలమహానాడు నేత శ్రీనివాసులు
ధన్వాడ, ఆగస్టు 20: నారాయణపేట అసేంబ్లీ స్థానంను ఎస్సీలకు,లేదా బీసీలకు కేటాయించాలని మాలమహానాడు రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సోమవారం ధన్వాడ మండల కేంద్రంలో మాలమాహనాడు యువజన సంఘం అధ్వర్యంలో సమావేశంలను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపేట నియోజకవర్గం ఎస్సీలకు,లేదా బీసీలకు కేటాయించాలనిలేని యాడల మాలమహానాడు యువజనసంఘం అధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఘనత రాజీవ్‌గాంధీదే
-ఎమ్మెల్యే చల్లా
వెల్దండ, ఆగస్టు 20: దేశంలో ఇన్‌ఫార్మషన్ టెక్నాలజీని ప్రవేశ పెట్టిన ఘనత దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీకే దక్కుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. సోమవారం వెల్దండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 75వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా రాజీవ్‌గాంధీ చిత్ర పటానికి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆనంతరం ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ ముందు చూపుతోనే దేశం నేడు పురోగాభివృద్ది వైపు అడుగులు వేస్తుందని అన్నారు. దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన మహోన్నతమైన వ్యక్తి, శక్తి రాజీవ్‌గాంధీని అన్నారు. ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోతిలాల్‌నాయక్, డిసిసి కార్యదర్శి దాసరి సూజాత, నాయకులు పర్వత్‌రెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, కృష్ణ, శేఖర్, రషిద్, పుల్లయ్య, నారాయణ, శ్రీనివాస్‌యాదవ్, వెంకటయ్యగౌడ్, ఏర్రశ్రీను, నాగేశ్వర్‌గౌడ్, గోపాల్, అంజి, శంకరయ్య పాల్గొన్నారు.