మహబూబ్‌నగర్

ముంచుకొస్తున్న యూరియా కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, ఆగస్టు 20: ఖరీఫ్ సీజన్‌లో ఆలస్యంగా వేసుకున్న పంటలకు యూరియా వేసేందుకు రైతులు మొగ్గు చూపుతుండగా, మార్కెట్‌లో యూరియా కొరత వారిని తీవ్రంగా వేధిస్తున్నది. గత వారం రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా ముసురుతో కూడిన వానలు పడుతుండటంతో ఆలస్యంగా మొక్కజొన్న పంటను సాగు చేసుకుంటున్న రైతులు అట్టి పంటకు బలం చేకూర్చేందుకు యూరియాను వేస్తున్నారు. దీనితో యూరియాకు బాగా డిమాండ్ పెరిగింది. ఒకేసారి డిమాండుకు అనుగుణంగా మార్కెట్‌లో యూరియా దొరకకపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. మార్క్‌ఫెడ్ నుంచి యూరియా కేటాయింపులు జరుగుతాయి. యూరియాను ఎక్కువగా పీఎసీఎస్‌ల ద్వారానే పంపిణీ చేసేందుకు మార్కెఫెడ్ వారు ఆసక్తి చూపుతుండటంతో బహిరంగ మార్కెట్‌లో ఆశించిన మేర యూరియా సరఫరా కావడంలేదు. యూరియాలో కొన్ని కంపెనీలు దొడ్డుగా ఉన్న యూరియాను సరఫరా చేస్తుండగా, మరికొన్ని కంపెనీలు సన్నగా ఉన్న వాటిని సరఫరా చేస్తుండటంతో రైతులు ఎక్కువగా సన్నరకమైన వాటికే మొగ్గు చూపుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో కొన్ని చోట్ల దొడ్డురకమైన యూరియా ఉన్నప్పటికి వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడంలేదు. పీఎసీఎస్ ద్వారా యూరియాను సరఫరా చేస్తున్నప్పటికి కొన్ని పీఎసీఎస్‌ల వారు వీటిని తెచ్చేందుకు ఆసక్తి చూపడంలేదు. హమాలీ ఇతరాత్ర ఖర్చులన్నీ కూడా వారే భరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన ధరకంటే ఒక్కపైసా కూడా ఎక్కువగా తీసుకోవడానికి వీలులేకపోవడంతో పలుచోట్ల పీఎసీఎస్‌ల వారు యూరియాను తెచ్చేందుకు ఆసక్తి చూపడంలేదు. ఇది కూడా కొరతకు కారణంగా చెబుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాకు 14,800 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టడం జరిగింది. దీనికి అనుగుంగా సరఫరా కాకపోవడంతో మార్కెట్‌లో యూరియా కొరత నెలకొంది. ప్రస్తుతం నాగర్‌కర్నూల్ పీఎసీఎస్ ద్వారా యూరియా సరఫరా అవుతుండటంతో నాగర్‌కర్నూల్ మండలంతోపాటు తాడూరు, తెలకపల్లి మండలాలకు చెందిన రైతులు సైతం ఇక్కడికే వచ్చి కొనుగోళ్లు చేస్తున్నారు. దీనితో రైతులకు యూరియా దొరకని పరిస్థితి నెలకొంది. యూరియా కొరత విషయంపై పీఎసీఎస్ చైర్మన్ వెంకట్రాములుతో మాట్లాడగా గతంలో నిర్దేశించిన ఇండెంట్ ప్రకారం సరఫరా జరిగేదని, ఈసారి అలా జరగడంలేదని, తాము ముందుగానే యూరియా కోసం డబ్బులు కట్టినప్పటికి రోజుకు ఒకలారీ చొప్పున సరఫరా చేస్తున్నారని దీనితో రైతులకు సరిపడు యూరియాను ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. యూరియాను వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చిన పీయుసీ యంత్రాల ద్వారా రైతులకు అందించాల్సి ఉన్నందున రైతులంతా కూడా అమ్మకం కేంద్రానికే రావాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం వానలు పడుతుండటంతో రైతులంతా కూడా ఒకేసారి యూరియా కోసం వస్తున్నందున డిమాండ్ బాగా పెరిగిందని, దీనికి అనుగుణంగా యూరియాను అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రైతులు కూడా ఇదేవిషయంపై మాట్లాడుతూ ప్రారంభంలో వానలు పడకపోవడంతో మొక్కజొన్న విత్తనాలు విత్తుకోలేకపోయామని, ఆలస్యంగా విత్తుకున్నందున ప్రస్తుతం పడుతున్న వానలకు యూరియా వేయాల్సి ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యూరియాను సరఫరా చేయాలని కోరారు.

కిందకు దిగని జాతీయ జెండా
ధన్వాడ, ఆగస్టు 20: మరికల్ మండల పరిధిలోని తీలేర్ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద స్వాతంత్య్ర దినోత్సవంను పురస్కరించుకోని ఎగురవేసిన జాతీయ జెండాను నేటికి గ్రామపంచాయతీ అధికారులుగాని,గ్రామపంచాయతీ సిబ్బందిగాని తోలగించలేదని తీలేర్ గ్రామప్రజలు వాపోతున్నారు. ఇకనైన తీలేర్ గ్రామపంచాయతీ సిబ్బంది స్పందించి జాతీయ జెండాను తోలగించాలని తీలేర్ గ్రామప్రజలు, యువకులు కోరుతున్నారు.

ప్రతి ఎకరాకు సాగునీరు
* ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి
* మంథన్‌గోడ్ శివారు భూములకు నీరు విడుదల
మక్తల్, ఆగస్టు 20: మక్తల్ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా తాను ముందడుగు వేస్తున్నాని, ఆరుగాలం కష్టించి పంటలు పండించి మనకు ఆన్నం పెట్టే రైతన్నలు ఆనందగా ఉండాలనీ, టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నానని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని మంథన్‌గోడ్ శివారు భూములకు సంగంబండ రిజర్వార్ ఎడమ ప్రధాన కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. ఇట్టి సాగునీటితో దాదాపు 500 ఎకరాలలోని పంట పొలాలకు ఎంతో ఊరట లభించనుందని తెలిపారు. ఈఖరీఫ్‌లో సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ల ద్వారా నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీటి అందించడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా కృష్ణానదికి నీరు రావడం జరుగుతుందని తెలిపారు. సంగంబండ, భూతూపర్ రిజర్వాయర్లకు జూరాల బ్యాక్ వాటర్ నుండి నీటిని పంపింగ్ చేస్తూ నింపుతున్నట్లు తెలిపారు. అలాగే ఇట్టి రిజర్వార్ల నుండి కుడి ఎడమ ప్రధాన కాలువ ద్వారా రైతుల పొలాలకు, చెరువు నింపుకునేందుకై నీటిని విడుదల చేయడం జరుగుతుందని చెప్పారు. ఈపాటికే రైతులు వరినాట్లకై సాగుచేస్తున్నారని తెలిపారు. తమ పొలాలకు వస్తున్న నీటితో ప్రతి రైతు సాగుచేసుకొని పంటలు పండించుకోవాలని ఎమ్మెల్యే రైతులకు సూచించారు. గత పాలకుల నిర్లక్షంతో ఈప్రాంతలోని రైతులు సాగునీటికి నోచుకోక పంటలు పండించుకోక ఉన్న పొలాలను బీళ్లుగా మార్చుకుని వలసల బాట పట్టారని అన్నారు. గడచిన నాలుగేళ్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో తమ ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పనిచేస్తున్నారని అన్నారు. పారదర్శకమైన పాలనను అందిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళుతున్న నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పూడికతీత, మిషన్ భగీరత పథకం ద్వారా ఇంటింటికి శుద్ధనీటి సరఫర ఇలా అనే సంక్షేమ పథకాలతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు.

మరో నెలరోజుల్లో ఇంటింటికీ శుద్ధజలాలు
-ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, ఆగస్టు 20: మరో నెలరోజుల వ్యవధిలో మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వం ఇచ్చిన నల్లాల ద్వారా మిషన్‌భగీరథ మంచినీటిని అందించడం జరుగుతుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని 36వ వార్డులో ఆర్‌ఓ ప్లాంటును ఆయన ప్రారంభించి మంచినీరును అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఇంటింటికి శుద్దజలాలు ఇచ్చిన తర్వాతనే ఓట్లు ఆడుగుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా చెప్పారని ఆ మాటను నిలబెట్టుకున్నామని ఆయన అన్నారు. మరో నెలరోజుల వ్యవధిలో ఇంటింటికి మిషన్‌భగీరథ పథకం ద్వారా కృష్ణాజలాలను శుద్దిచేసి మంచినీరును అందించబోతున్నామని తెలిపారు. ఇప్పటికే శ్రీశైలం బ్యాక్‌వాటర్ మన్యంకోండ గుట్టపైకి తీసుకువచ్చామని దాంతో అన్ని గ్రామాల్లోని ఇంటింటికి మంచినీరును అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వారం రోజుల్లో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ కూడా వివిధ గ్రామాల్లో పూర్తి అవుతుందని అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలే కాపాడుకోవాలని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న టీఆర్‌ఎస్ పార్టీని ఆశీర్వదించాలని ఆయన కోరారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నింటిని నేరవేరుస్తూనే ప్రజలకు చెప్పని హామీలను కూడా వివిధ సంక్షేమ పథకాల రూపంలో అందజేయడం జరిగిందన్నారు. మరో రెండేళ్లలో మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని ప్రతి సెంటుభూమికి తాగునీరు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో విలీనం అయిన గ్రామాలకు సైతం మిషన్‌భగీరథ నీటిని అందిస్తామని తెలిపారు. కొన్న గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణం జరుగుతుందని అయినప్పటికిని నేరుగా నల్లాలకు నీటిని మల్లించి ఓ పద్దతి ప్రకారంగా శుద్దజలాలను అందిస్తామన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అవాక్కులు చేవాక్కులు చేస్తున్నారని వారికి ప్రజలే బుద్దిచెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాధ ఆమర్, నాయకులు వెంకటయ్య, రాజేశ్వర్‌గౌడ్, రాజేశ్వర్, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్ సేవలు మరువలేనివి
-డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్
మహబూబ్‌నగర్, ఆగస్టు 20: దివంగత ప్రధానీ రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలు మరవలేనివని డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రాజీవ్‌గాంధీ 74వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీసీసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి, స్థానిక అశోక్‌టాకీస్ చౌరస్తాలోగల రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా కొత్వాల్ మాట్లాడుతూ చిన్నవయస్సులోనే దేశానికి ప్రధానీగా భాద్యతలు నిర్వర్తించినట్లు తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశాన్ని ప్రపంచచంలో అగ్రగామిగా నిలపడంలో రాజీవ్‌పాత్ర ఎంతో ఉందని అన్నారు. యువతకు 18 ఏళ్లకే ఓటుహక్కు కల్పించిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. 73 అధికరణకు సంస్కరణలు తెచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థకు జవససత్వాలు కల్పించారని అన్నారు. రాజీవ్‌గాంధీ ఆశయ సాధనకు కాంగ్రెస్ పాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.