మహబూబ్‌నగర్

తల్లిదండ్రులు పస్తులుండైనా పిల్లలను చదివించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలంపూర్, జనవరి 2: తల్లిదండ్రులు ఒకపూట పస్తులుండైనా పిల్లలను బాగా చదివించాలని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో సంతోషినగర్ కాలనీలో జరిగిన కార్యక్రమానికి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర వ్యవసాయ మార్కెట్‌శాఖ డైరెక్టర్ లక్ష్మిబాయ్, జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, స్థానిక ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 31వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ పిల్లలు కష్టపడి చదవాలని, ఎంతటి కష్టానైన్నా తల్లిదండ్రులు భరించి పిల్లలను భాగా చదివించాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యవసాయ మార్కెట్‌శాఖ డైరెక్టర్ లక్ష్మిబాయ్ మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో రాణించినప్పుడే దేశం అన్నివిధాల అభివృద్ధి చెందుతుందని, పేదరికాన్ని జయించాలంటే చదువు ఒక్కటే మార్గమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సూర్యబాబుగౌడ్, ఎంపిపి శంషాద్ ఇస్మాయిల్, సర్పంచు జయరాములు, వార్డు సభ్యులు హరిబాబు, మహేష్, ఆదర్శ యువజన సంఘం అధ్యక్షుడు పెద్దబాబు, కార్యదర్శి ప్రభాకర్, నాయకులు వెంకటేశ్వర్లు, రమేష్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.