మహబూబ్‌నగర్

ప్రభుత్వ విద్యను బలహీనపరుస్తున్న పాలక వర్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, జనవరి 2: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వరంగంలో ఉన్న విద్యావ్యవస్థను బలహీనపరుస్తూ ప్రైవేట్ రంగానికి పెద్దపీఠవేస్తున్నాయని ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు ధర్మతేజ, ప్రధాన కార్యదర్శి రాములు ఆరోపించారు. శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ తాలూకా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెడుతూ దేశ చరిత్రను వక్రీకరించి జాతీయ సమైఖ్యతను దెబ్బతీసేలా విద్యను కాషాయికరణకు కుట్ర పన్నుతుందన్నారు. విదేశివర్సిటీలను విచ్చలవిడిగా దేశంలోకి ఆహ్వానిస్తూ మనదేశ లౌకికతత్వానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో విద్యా రంగానికి నిధుల కొరత విధిస్తూ పెట్టుబడిదారులకు రాయితీకోసం లక్షకోట్లరూపాయాలు హెచ్చిస్తుందన్నారు. తరగతి గదులలోనే దేశభవిష్యత్తు తీర్చిదిద్దుకుంటుందని కోటారి కమీషన్ సిఫారసులను బుట్టదాఖలు చేస్తుందన్నారు. అధికారంలోకి రాకముందు నల్లధనం వెలకితీత, ఉద్యోగాలు, దేశాభివృద్ది, అవినీతి నిర్మూలన ఇలా అనేక నినాదాలు చేసిన బిజెపి నేతలు గద్దెనెక్కిన తరువాత వాటి గురించి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. 18 నెలల పాలనలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు తప్ప దేశానికి ఒరగబెట్టినదేమిలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థులను విస్మరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావము విద్యార్థుల ఆత్మబలిదానాలు, పోరాటాల వల్లనే సాధ్యమైందన్నారు. నేడు కేసిఆర్ పిజి ఉచిత విద్య, సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు, కామన్ స్కూల్ విదానం మరిచిపోయి గతేడాది ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్‌మెంట్‌ను మంజూరు చేయలేదన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై, పాలక వర్గాలు అవలంభిస్తున్న విధానాలపై పోరాటాలకు సిద్దంకావాలని వారు పిలుపునిచ్చారు.