మహబూబ్‌నగర్

పెన్షనర్ల సమస్యలను మ్యానిఫెస్టోలో పెట్టిస్తాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 17: రాష్ట్రంలోని పెన్షనర్ల సమస్యలను మ్యానిఫెస్టోలో పెట్టనున్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్థన్‌రెడ్డి అన్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎన్నో మాటలు చెప్పారు కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగేళ్ల కాలంలో కనీసం ఒక్కసారైన పెన్షనర్లకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని విమర్శించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్ వంటి అనేక రాష్ట్రాల్లో 65సంవత్సరాలు నిండిన పెన్షనర్‌కు 15శాతం బెన్‌ఫిట్స్ ఇస్తున్నాయని మన రాష్ట్రంలో మాత్రం 75సంవత్సరాల వారికి ఇస్తున్నారు కానీ 10వ పిఆర్సి 2004 మన రాష్ట్రంలో 70సంవత్సరాల వారికి 15శాతం అలవెన్సులు ఇవ్వాలని సిఫార్సు చేసింది. కానీ 10వ పిఆర్సి చేసిన సిపార్సును తెరాస అధినేత కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి ఆమలు చేస్తానని చెప్పి మాట ఇచ్చి ఆమలు చేయకుండానే వైదోలగారని ఆరోపించారు. పెన్షనర్ల సమస్యలను విస్మరించిన తెరాసను ఓడించి మ్యానిఫెస్టోలో పెన్షనర్ల సమస్యలను పెట్టిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.